టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , క్రేజీ దర్శకుడు బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా వీటి ద్వారా ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మూడవ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. వాల్తేరు వీరయ్య మూవీ నుండి వీరయ్య టైటిల్ సాంగ్ ను డిసెంబర్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన రెండు పాటలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూడవ పాటపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వాల్తేరు వీరయ్య మూవీ లోని మూడవ పాట ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: