మెగాస్టార్ చిరంజీవి గతేడాది ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దాని తరువాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో నటించినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి కారణం ఈ సినిమా మలయాళ మూవీ అయినా లూసీ ఫర్ కు రీమేక్ కాబట్టి. అందులోనూ మలయాళం లో ఈ సినిమా ఓటీడీలో కూడా అందుబాటులో ఉండడంతో ఈ సినిమాను చూడడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు.

 అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఎలాగైనా ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టును కొట్టాలని వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఎవరూ ఊహించిన విధంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు.అయితే తాజాగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రవితేజ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 ఇక వీటికి సంబంధించిన టీజర్ సాంగ్స్ మరియు పోస్టర్లు విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి మరియు రవితేజల మధ్య ఒక భారీ ఫైట్ సీన్ ఉంటుంది అని.. ఇక వీరిద్దరి మధ్య జరిగే ఫైట్ నువ్వా నేనా అన్న రేంజ్ లో ఉంటుంది అని.. వీరిద్దరి ఫైట్ నీ బాబి చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు అని.. అంతేకాదు వీరిద్దరి మధ్య జరిగే ఈ ఫైట్ త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ల మధ్య జరిగే ఫైట్ రేంజ్ లో ఉంటుంది అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: