సాధారణంగా ప్రతి ఒక్కరికి వ్యాపారం మొదలు పెట్టి, లక్షల్లో లాభార్జన చేయాలని ఉంటుంది. ఇక అందుకు తగ్గట్టుగానే వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ కరోనా మహమ్మారి వచ్చిన తరువాత చాలామంది బయటకు వెళ్ళలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే చాలామంది డబ్బు సంపాదించాలని , ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడితే చాలు అని అనుకుంటున్నారు. అయితే ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లో ఉంటూనే మొదలుపెట్టే వ్యాపారం ఒకటి మేము మీ ముందుకు తీసుకువచ్చాము. ఇక దానికి కావలసిన వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ వ్యాపారం ఏదో కాదు పేపర్ కప్ తయారీ . ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మంచి రాబడి పొందే వ్యాపారం కాబట్టి ప్రతి ఒక్కరు సులభంగా మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ పేపర్ కప్ బిజినెస్ కు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని పొందవచ్చు. ముఈ బిజినెస్ ను ఎవరైతే స్టార్ట్ చేస్తారో అలాంటివారికి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహాయం అందుతుంది. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర లోన్ స్కీమ్ ద్వారా రుణాలు పొందవచ్చు. మీరు కూడా ఈ పేపర్ కప్స్  బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అందుకు 10 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుంది.

ఇంత మొత్తం ఎందుకు అవుతుంది అంటే , ఈ మిషన్ కు సంబంధించిన మెటీరియల్ అలాగే మిషన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇందులో పనిచేసే ఉద్యోగులకు 35 వేల రూపాయలు ఇచ్చినా, ముడి పదార్థాలకు రూ. 3.75 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక మిగతా వాటికి రూ. 32 వేల వరకు ఖర్చులు వస్తాయి. మీరు ఒక సంవత్సరానికి 2.2 కోట్ల పేపర్ కప్ లను తయారు చేయవచ్చు. ఒక్కో కప్పు ధర 30 పైసలకి అమ్మినా మంచి లాభం లభిస్తుంది.

మీరు ముద్ర లోన్ ద్వారా లోన్ తీసుకున్నట్లయితే ఈ లోనే ద్వారా 75 శాతం వరకు తిరిగి డబ్బులు పొందవచ్చు. అందువల్ల కచ్చితంగా రాబడి పొందవచ్చని చెప్పవచ్చు. సుమారుగా సంవత్సరానికి లక్షల్లో లాభం పొందే అవకాశాలుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: