ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ చాలామంది చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాము అని జీతాలు పెంచాలని అప్పుడప్పుడు ధర్నాలు చేస్తున్న సన్నివేశాలను మనం చూస్తూనే ఉంటాం. ఇక ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు మరో శుభవార్త తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదేమిటంటే పీ ఎఫ్ అమౌంట్ పెంచబోతున్నట్లు సమాచారం అందించింది.. అది ఎలా అంటే ప్రభుత్వం నాలుగు కొత్త కోడ్ లను ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తోంది. ఇక ఈ ప్రకారం ఉద్యోగులు జీతాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పిఎఫ్ అమౌంట్ పెరిగినప్పటికీ టేక్ హోమ్ జీతాలు మాత్రం తగ్గుతున్నట్లు సమాచారం.

ఒక రకంగా చెప్పాలంటే ఇదీ మన మంచికే అని చెప్పాలి .ఎందుకంటే టేక్ హోం జీతాలు ఎక్కువైతే..ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది.ఇక పిఎఫ్ రూపంలో ఎక్కువ డబ్బును దాచుకోవడం వల్ల భవిష్యత్తులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం సామాజిక, వేతన, భద్రత వృత్తి ,పారిశ్రామిక సంబంధాలు, ఆరోగ్యం ,పని పరిస్థితులపై లేబర్ కోడ్ లను తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఇక కొత్త లేబర్ కోడ్ విధానం 2022 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు అవుతాయని సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.. కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారంలో మూడు రోజులు సెలవు తీసుకుని.. నాలుగు రోజులు పని చేసే అవకాశాన్ని కల్పించనున్నారు.

మొత్తం జీతంలో 50 శాతం కంటే ఎక్కువగా అలవెన్సులు ఉండకూడదు అని కూడా ఈ లేబర్ కోడ్ లు నిర్దేశిస్తున్నాయి. కానీ బేసిక్ సాలరీ అనగా ప్రాథమిక జీతం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇకపోతే గ్రాట్యుటీ చెల్లింపులు పెరగడం, ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల సమ్మతి  కారణంగానే జీతాలు తగ్గుతున్నట్లు సమాచారం .ఏది ఏమైనా అమౌంట్ పెరుగుతుందని తెలియడంతో ఉద్యోగులు కాస్త హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: