ఈ మధ్య కాలంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు కూడా ఒక కారు కొనుగోలు చేయాలని కలలు కంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా వరకు మార్కెట్లో మనకు లభ్యమయ్యే కార్లు అన్నీ కూడా పది లక్షల ధర పలుకుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే సామాన్యుడు కార్ కొనాలనే కోరిక ను కూడా చంపుకుంటున్నాడు.. అయితే సామాన్యుడి కల త్వరలోనే నెరవేరబోతోంది. అంతే కాదు కేవలం ఐదు లక్షల కంటే లోపే మంచి బ్రాండెడ్ కార్లు కూడా దొరుకుతున్నాయి.. వాటి వివరాలు ఇప్పుడు ఒకసారి అడిగి తెలుసుకుందాం.మారుతి సుజుకి:
దేశీయ వాహన తయారీ దిగ్గజం అయినటువంటి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మొదటిసారి ఇండియాలో సరికొత్త సెలేరియో మోడల్ ను ఆవిష్కరించింది. 2014లోనే విడుదలైన ఈ కార్ లో తాజాగా కొన్ని మార్పులు చేసి మరోసారి లాంచ్ చేసింది సుజుకి. ముఖ్యంగా మార్కెట్లో పోటీ కోసం ఇందులో చాలా రకాల అప్డేటెడ్ ఫీచర్లను కూడా జోడించింది. తాజాగా విడుదలైన ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్ తో విడుదలైంది కాబట్టి  26.68కేఎంపిఎల్ మైలేజ్ కూడా ఇస్తుంది. 2014లో విడుదలైన ఈ కారు ఏడాదిలోపే 5.9 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది.


ఇకపోతే ఈ మారుతి సుజుకి సెలెరియో మోడల్ ఫీచర్ల విషయానికి వస్తే.. సుజుకి సెలెరియో పాత మోడల్ కంటే ఇప్పుడు ఆకారంలో కూడా చాలా విశాలంగా ఉంటుంది.. ముందుకంటే ఇప్పుడు పూర్తిగా రీడిజైన్ చేసి మార్కెట్లోకి విడుదల చేశారు.. ఇక ముందు భాగంలో క్రోమ్ యాక్సిడెంట్లు.. సుజుకి లోగో తో కూడిన ఒక గ్రిల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి డోర్ పై కూడా లిఫ్ట్ టూ ఓపెన్ టైప్ హ్యాండిల్స్ ను డిజైన్ చేశారు.. అంతే కాదు  బ్యాక్  కెమెరా ని కూడా అమర్చడం జరిగింది. అంతేకాదు డాష్ బోర్డు లో పవర్ విండోస్ స్విచ్ లను కూడా చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: