ఇటీవల కాలంలో చాలామంది బ్యాంకులో పర్సనల్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత రుణాల కోసం చాలామంది ఇతరులపై ఆధారపడకుండా కేవలం బ్యాంకుల మీద ఆధారపడుతూ తక్కువ వడ్డీకి మంచి రుణాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సులభంగా లోన్ లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ రుణాన్ని వడ్డీతో కలిపి ఈఎమ్ఐ ల ద్వారా రుణాన్ని చెల్లించే అవకాశం ఉంది. ఇకపోతే మీరు రుణాలు తీసుకునే ముందు తప్పకుండా వడ్డీ రేటు ఎంత , బ్యాంకులో నిబంధనలు ఏమిటి, కాలపరిమితి , లేట్ ఫీజు వంటి కీలక అంశాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

ఇక పర్సనల్ లోను మంజూరు చేసే సమయంలో రుణాలను తిరిగి చెల్లించే సమయంలో కూడా బ్యాంకులు ఆరు రకాల ఫీజులను వసూలు చేస్తాయి. ఎంత మొత్తం వసూలు చేస్తున్నాయి .. ఆ ఫీజులు ఏంటి అనే విషయాలను మీరు తెలుసుకున్న తర్వాతనే పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలి..

ప్రాసెసింగ్ ఫీజు:
బ్యాంకులు ఇచ్చే లోన్ మొత్తం పైన ఈ ప్రాసెసింగ్ ఫీజు ఆధారపడి ఉంటుంది.. బ్యాంకుల నిర్వహణ వ్యయం కోసం ఒక్కో బ్యాంకు ఒక్కోరకంగా ఈ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. ఇక మొత్తంగా మీ లోన్ మొత్తం పై 0.5 నుంచి 2.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు అనేది తప్పనిసరిగా పే చేయాలి. ఇకపోతే మీరు పర్సనల్ లోన్ తీసుకోబోయే ముందు కచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసుకొని మరి క్లారిటీ తీసుకోవడం తప్పనిసరి.

వెరిఫికేషన్ ఛార్జ్:
పర్సనల్ లోన్ ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు వెరిఫికేషన్ చార్జీలు కూడా వసూలు చేయడం గమనార్హం. మీ పర్సనల్ లోన్ కు మీరు అప్లై చేయాలనుకుంటే రుణాలు తిరిగి చెల్లించడానికి మీ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బ్యాంకులో థర్డ్ పార్టీ ద్వారా చెక్ చేయించుకుంటాయి. ఇక ఆ డబ్బు కూడా మీ లోన్ లోనే తీసుకుంటారు.అది కూడా వెరిఫికేషన్ ఫీజు కింద బ్యాంకుల వసూలు చేయడం గమనార్హం.

వీటితోపాటు డూప్లికేట్ స్టేట్మెంట్ ఫీజు , ఈఎంఐ లేట్ ఫీజు,  జిఎస్టి టాక్స్ , ఫ్రీ పేమెంట్ ఛార్జ్ అన్ని కూడా మీతోనే వసూలు చేస్తారు . అయితే ఏ బ్యాంకుల్లో ఎంత వసూలు చేస్తున్నారో తెలుసుకొని మరి ఆ బ్యాంకుల్లో లోన్ తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: