
ఇకపోతే మీరు ఇంట్లో కూర్చుని కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఎక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా డబ్బు సంపాదించవచ్చు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా పౌష్టిక ఆహారంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో మాంసాహారాన్ని మానేసి శాఖాహారాన్ని తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే పుట్టగొడుగులకు డిమాండ్ బాగా పెరిగింది. శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు ఈ పుట్టగొడుగుల ద్వారా మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి..
ఇంటిలో పుట్టగొడుగు సాగు చేయడానికి 5000 రూపాయలు ఉంటే సరిపోతుంది. వీటి పెంపకానికి 30 నుండి 40 చదరపు సెంటీమీటర్లు కలిగిన ఒక రూమ్ ఉంటే సరిపోతుంది మార్కెట్లో కంపోస్ట్ కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. 25 రోజుల్లోనే పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి . వీటి ధర ప్రస్తుతం ఒక కేజీ 150 రూపాయలు పలుకుతోంది రిటైల్ మార్కెట్లో మీరు 200 గ్రాములు పుట్టగొడుగుల ప్యాకెట్ను 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అమ్మవచ్చు. ఇలా చేస్తే మీ వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా మీకు మరింత లాభం కూడా వస్తుంది.