ఎలాంటి వారికైనా సరే కొన్ని సందర్భాలలో లోన్ అనేది చాలా అవసరం పడుతూ ఉంటుంది.. ఇలాంటి సందర్భాలలో ఎక్కువగా లోన్ ఇవ్వాలంటే బ్యాంకుల సైతం తమ అకౌంట్ యొక్క సిబిల్ స్కోర్ ను చెక్ చేసీ లోన్ ఇస్తూ ఉంటారు.. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మంది ప్రజలకు సిబిల్ స్కోర్ పడిపోయింది. చాలా మంది సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో క్రెడిట్ స్కోరు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సిబిల్ స్కోర్ పెరగడానికి కోసం చాలా సమయం పడుతుంది.. అయితే సిబిల్ స్కోర్ త్వరగా పెరగడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.


ముందుగా మీ క్రెడిట్ స్కోర్ ని తనిఖీ చేసిన తర్వాత అందుకు తగ్గడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి..

ముఖ్యంగా మీ బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్ పైన ఎక్కువ మార్కు చూపిస్తుంది.EMI లను సకాలంలో చెల్లించడమే ఉత్తమం.


క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ మొత్తం మీకు క్రెడిట్ పరిమితి కంటే తక్కువ మొత్తంలోనే ఉంచేలా చూసుకోవాలి. అంటే 30 శాతానికి మించి క్రెడిట్ పరిమితిలో ఉంచవలెను. అప్పుడే అధిక క్రెడిట్ స్కోర్ చూపుతుంది.


ఎవరైనా ఒక క్రెడిట్ కార్డు ని మాత్రమే తీసుకోవడం మంచిది.. బహుళ క్రెడిట్ కార్ల కోసం అప్లై చేస్తే మీ స్కోర్ తాత్కాలికంగా తగ్గుతూ వస్తుందట.


కనీసం ఆరు నెలలకు ఒకసారైనా సరే కచ్చితంగా మీ సిబిల్ స్కోర్ ని ఉచితంగానే బ్యాంకుల వద్దకు వెళ్లి చెక్ చేసుకుంటూ ఉండవచ్చు.


మీకు తెలియకుండా ఏవైనా ఖాతాలు ఉండి వాటిలో లోన్ కానీ బాకీ గాని ఉన్నట్లు అయితే వీలైనంత త్వరగా వాటిని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది.మీకు లోన్ కావాలంటే కచ్చితంగా మీ క్రెడిట్ కార్డు యొక్క హిస్టరీ సైతం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే తక్కువ మొత్తంలో తీసుకొని సకాలంలో కడుతూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: