పవన్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో కాజల్ లక్ష్మీరాయ్ లతో పాటు హీరోయిన్ సంజన కూడ ఒక ముఖ్య పాత్ర చేస్తోంది. అయితే ఆ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ గురించి ‘సర్ద్ద్గార్ గబ్బర్ సింగ్’ దర్శక నిర్మాతలు పెడుతున్న ఖర్చు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమాలో సంజన రాజకుమారి పాత్రను పోషిస్తున్నట్లు స్వయంగా ఆమె మీడియాకు లీక్ చేసింది. 

తాను ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ పక్కన నటించాలి అని కలలు కంటున్నా ఇటువంటి అద్భుతమైన అవకాశం పవన్ తనకు పిలిచి ఇస్తాడని తాను కలలో కూడ అనుకోలేదు అని అంటోంది సంజన. తాను నటిస్తున్న ఈ రాజకుమారి పాత్ర ‘సర్ద్ద్గార్’ సినిమాకు అత్యంత కీలకంగా ఉండటమే కాకుండా ఈసినిమాకు ఒక మలుపు తిప్పే పాత్ర తనది అని చెపుతోంది సంజన. 

ఇదే సందర్భంలో సంజన రాజకుమారి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ వివరాలు కూడ బయటకు వస్తున్నాయి. ఈసినిమా యూనిట్ నుండి అందుతున్న లీక్ ల ప్రకారం ఈసినిమాలో రాజకుమారిగా నటిస్తున్న సంజన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన 9 గజాల ఖరీదైన పట్టు చీరల మధ్య సంజన కనిపిస్తుందట. అంతేకాదు సంజన కోసం చాల ఖరీదైన హెవీ జ్యూయలరీ డిజైన్ చేయించినట్లు టాక్. 

సంజన కాస్ట్యూమ్స్ విషయంలో పవన్ ఎంతో శ్రద్ధ చూపెట్టాడని వార్తలు వస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్’ సినిమా తరువాత శ్రుతిహాసన్ క్రేజ్ పెరిగి పోయినట్లుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో తన కెరియర్ కు టర్నింగ్ వస్తుందని సంజన చాల ఆశలు పెట్టుకుంది. పవన్ సినిమాల కల్చర్ కు భిన్నంగా సంజన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో రాజకుమారిగా సంజనను చూపెట్టడానికి ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే ‘సర్దార్’ సినిమాలో సంజన పాత్ర చాల కీలకం అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: