స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ అరుదైన మైలురాయిని దాటేశాడు. ఏంటనుకుంటున్నారా... తెలుగు పరిశ్రమలో అత్యధికంగా అభిమానులను సంపాదించుకున్న ‘ఫేస్ బుక్ ఫ్యాన్ పేజ్’ అల్లు అర్జున్ దే. ఫేస్ బుక్ లో అతడి ఫ్యాన్స్ సంఖ్య ఇప్పుడు ఐదులక్షలకుపై మాటే.
ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ కి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో కూడా మాంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. దాంతో అక్కడా అభిమాన గణం గణనీయంగానే పెరిగింది. దీంతో నెమ్మదిగా ఫేస్ బుక్ గణాంకాలు మారిపోయి... ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోనే అత్యధిక ఆన్ లైన్ ఫ్యాన్స్ ను దక్కించుకున్న ఘనత అల్లు అర్జున్ చేజిక్కించుకున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: