గత కొంత కాలంగా రానా ఆరోగ్య విషయంలో అనేక వార్తలు హడావిడి చేస్తూనే ఉన్నాయి. రానాకు కిడ్నీ సమస్య ఏర్పడిందని అతడిని సింగపూర్ కు కాని అమెరికాకు కాని వైద్యం నిమిత్తం తీసుకువెళ్ళే ఆలోచనలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈవార్తలను రానా అదేవిధంగా అతడి తండ్రి సురేశ్ బాబు ఖండిస్తూనే వస్తున్నారు. 
Rana new look goes viral
ఈవార్తలతో సంబంధం లేకుండా రానా తన సినిమాల షూటింగ్ లో బిజీగానే ఉంటున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబునాయుడు పాత్రను పోషిస్తున్న రానా పై గత కొద్ది రోజులుగా క్రిష్ కీలక సన్నివేశాలు తీస్తున్నాడు. ఇది చాలదు అన్నట్లుగా రానా తన సురేశ్ నిర్మాణ సంస్థ తరపున ఒక చిన్న సినిమాను తానే ప్రమోట్ చేస్తూ విడుదల చేస్తున్నాడు. 
Whoa! Rana Daggubati to play CM Chandra Babu Naidu in NTR biopic
‘కేరాఫ్ కంచర పాలెం’ పేరుతో త్వరలో విడుదల కాబోతున్న ఈమూవీ ఒక తమిళ రీమేక్ అతి చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈసినిమా ఖచ్చితమైన విజయం సాధిస్తుందని రానా అభిప్రాయపడుతున్నాడు. ఈమూవీని ప్రమోట్ చేస్తూ రానా ఈమధ్య మీడియా ముందుకు వచ్చిన నేపధ్యంలో అతడి లుక్ చూసి మీడియా వర్గాలు చాల షాక్ అయినట్లు సమాచారం.
C/o Kancharapalem Movie Release date Posters
గత నెలలో రానా మీడియా ముందు కనిపించిన లుక్ తో పోలిస్తే చాల సన్నపడిపోయి అతి నీరసంగా కనిపిస్తున్న రానా లుక్ చూసి రానా శరీరంలో మార్పులు బాగా వస్తున్నాయి అని మీడియా వర్గాలు కామెంట్ చేసుకున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు రానా చాల ఖచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తూ సోడియం అతితక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండటం వల్ల రానా ఇలా పూర్తిగా సన్నబడ్డాడు అని అంటున్నారు. ఇలాంటి పరిస్తుతులే కొనసాగితే మరొక నెల గడిచేసరికి రానాలో ఇంకెన్ని మార్పులు వస్తాయో అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: