సెంటిమెంట్లు, నమ్మకాలు మన సినిమా ఇండస్ట్రీలో కొంత ఎక్కువ అనే చెప్పాలి. ఇక వాటిని పట్టుకుని మన ప్రేక్షకులు కూడా సదరు సినిమా వ్యక్తుల జయాపజయాలను వాటితో ముడిపెడుతూ ఉంటారు. ఇక ఆ విధంగా ఎవరైనా హీరోకాని, దర్శకుడు కానీ మొదటి సినిమా హిట్ కొడితే, రెండవ సినిమాతో ఎంతవరకు హిట్ కొట్టి ద్వితీయ విఘ్నాన్ని ఎదుర్కొంటారా అని చూస్తుంటారు. ఇక ఇటీవల హీరో నాని నిర్మాతగా కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'అ'. ఆ సినిమాతో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్, 

ప్రేక్షకుల అలానే విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుని మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అయన దర్శకత్వంలో రెండవ సినిమాగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా రూపొందిన కొత్త సినిమా కల్కి నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ట్రైలర్ మరియు పాటలతో కొంత హైప్ పెంచిన ఈ సినిమాకు, నేడు ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనను బట్టి చూస్తుంటే ఇది మంచి విజయవంతం అయినట్లు చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఫస్ట్ హాఫ్ మాములుగా  సాగుతూ, సెకండ్ హాఫ్ కొంత భాగం అయిన తరువాత సినిమా పుంజుకుంటుందని, అంతేకాక ఈ కల్కి సినిమాకు లాస్ట్ అర్ధగంట ప్రాణం అని చూసిన వారు చెప్తున్నట్లు సమాచారం. 

ఇక ఈ విధంగా చూస్తే, ఇటీవల గరుడ వేగాతో లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో రాజశేఖర్ తో పాటు, దర్శకుడు ప్రశాంత్ వర్మ కు కూడా ఈ సినిమా మంచి హిట్ ని ఇచ్చిందనే అర్ధం అవుతుంది. ఇక ఈ విధంగా చూస్తే దర్శకుడు ప్రశాంత ద్వితీయ విఘ్నాన్ని సునాయాసంగా దాటేసాడని అంటున్నారు. అయితే మొదటి రోజు టాక్ తో పూర్తిగా సినిమాని హిట్ అని తేల్చలేం అని, మరికొద్దిరోజుల్లో గడిస్తేనేగాని సినిమా పరిస్థితి పూర్తిగా అర్ధం కాదని అంటున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఎంత రేంజ్ హిట్ అవుతుందని అనేది ప్రక్కన  పెడితే, దాదాపుగా విడుదలైన అన్ని చోట్ల నుండి కల్కి మంచి రెస్పాన్స్ రాబట్టినట్లు చెప్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: