అక్టోబ‌రు 2న విడుదల అవుతున్న ‘సైరా’  మ్యానియాను లెక్కచేయకుండా మ‌రో  తెలుగు సినిమా విడుద‌ల‌కు రెడీ అవ్వ‌డం అత్యంత సాహసంగా మారింది ‘సైరా’ విడుదలను పట్టించుకోకుండా కేవలసం రెండు రోజుల గ్యాప్ తో హీరో గోపీచంద్ ‘చాణక్య‌’ విడుదల అవుతూ ఉండటం ఇండస్ట్రీ వర్గాలలోని చాలా మందికి అర్ధం కాని విషయంగా మారింది. 

వాస్తవానికి గోపీచంద్ కు సరైన హిట్ వచ్చి చాలాకాలం అయింది. ఇలాంటి పరిస్థితులలో ఏ ధైర్యంతో గోపీచంద్‌ దసరా రేస్ కు వస్తున్నాడు అంటూ చాలమంది షాక్ అవుతున్నారు. అయితే ‘చాణక్య’ నిర్మాతల వెర్షన్ మరోలా ఉంది. బుధ‌వారం ‘సైరా’ విడుద‌ల అవుతోంది. అయితే ఈమూవీ విడుదలరోజున మ్యానియా చాలా తీవ్రస్థాయిలో ఉన్నా గురు శుక్ర వారాల‌కు ‘సైరా’ హ‌వా కొద్దిగా తగ్గుతుందని ‘చాణక్య’ నిర్మాతల అంచనా. 

దీనికితోడు ‘సైరా’ ను ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈ వారాంతానికి తెలుగు రాష్ట్రాలలోని చాలమంది ‘సైరా’ ను చూసి ఉంటారుకాబట్టి వచ్చేవారం వచ్చే దసరా పండుగకు మరో సినిమా అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకోసమే ఎటువంటి హడావిడి చేయకుండా ‘చాణక్య’ సైలెంట్‌ గా శ‌నివారం వ‌స్తున్నాడు అంటూ ఈ మూవీ నిర్మాతలు క్లారిటీ ఇస్తున్నారు. ఇదిఇలా ఉండగా ఈసినిమా విడుదలను అడ్డు కోవడాని ఒక ప్రముఖ నిర్మాత రంగంలోకి దిగి   ‘చాణక్య‌’ కు థియేట‌ర్లు ఇవ్వొద్దు అంటూ పరోక్షంగా సూచనలు ఇస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో  గాసిప్పులు  హడావిడి చేస్తున్నాయి. 

అంతేకాదు ‘సైరా’ ‘బాహుబ‌లి’ రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టాల‌న్న ధ్యేయంతో వ‌స్తోంద‌ని పండ‌గ అయ్యేంత వ‌ర‌కు ఆసినిమా తప్ప మరో సినిమా ఉంటే   ‘సైరా’ రికార్డులు అందుకోవడం కష్టం అని కూడ ఆ ప్రముఖ నిర్మాత అనేకమంది థియేటర్స్ యజమానులకు చెపుతున్నట్లు టాక్. మెగా కుటుంబానికి ఆ ప్రముఖ నిర్మాత అత్యంత సన్నిహితుడు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు అన్ని అవాస్తవాలు అని ఒక ఫెయిల్యూర్ హీరో సినిమా గురించి చిరంజీవి ఎదుకు భయపడతాడు అంటూ ఈవార్తలు ఆన్ని గాసిప్పులు మాత్రమే అంటూ చిరంజీవి సన్నిహితులు ఈ వార్తలను లైట్ గా తీసి పారేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: