పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను వాడుకుందామని మల్టీ నేషనల్ కంపెనీల దగ్గర నుంచి చిన్నచిన్న సినిమా నిర్మాతల వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు అనడానికి మరో కధనం ఫిలింనగర్ లో వినపడుతోంది. మీడియాకు దూరంగా ఉండే పవన్ ఈమధ్యనే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కు అతిధిగా వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఈకార్యక్రమం ముగిసి కొద్ది రోజులు కూడా కాకుండానే పవన్ మరో పబ్లిక్ ఫంక్షన్ కు రెడీ అవుతున్నాడు.
పవన్ మేనల్లుడు సాయి ధర్మతేజ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘రేయ్’ సినిమా ఆడియో ఫంక్షన్ కు అతిధిగా రావడానికి ఈ సినిమా నిర్మాత, దర్శకుడు వైవిఎస్ చౌదరి బలవంతం పై ఒప్పుకున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ కార్యక్రమానికి పవన్ ను అతిధిగా పిలవడం వలన ఈసినిమా హీరో సాయిధర్మతేజకు మంచి పేరు వస్తుందని ఒక ఆలోచన అయితే ఇప్పటికే ఈ సినిమా పై దాదాపు 20 కోట్లు కేపెసిటీ ఖర్చు పెట్టిన నిర్మాత చౌదరి పవన్ రాకను మార్కెటింగ్ అస్త్రంగా తీసుకుని ఈ సినిమాకు మంచి ఇమేజ్ క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త హీరో సినిమాకు 30 కోట్ల బిజినెస్ చేయాలనీ చౌదరి ప్లాన్ అంటున్నారు.
ఈ విధంగా కూడా పవన్ సాయి ధర్మతేజ్ సినిమా ఫంక్షన్ కు రావడం ఆ సినిమా నిర్మాతకు పవన్ ఇమేజ్ దాదాపు 30 కోట్ల బిజినెస్ చేసి పెట్టింది అనుకోవాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: