‘రాజాగారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు,
అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మూవీ విడుదల నేపథ్యంలో ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో...
చిత్ర దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ... ఇంకో రెండు రోజుల్లో మా చిత్రం విడుదల కాబోతుంది. 18న విడుదలవుతున్న ఈ చిత్రం చిన్న పిల్లలతో సహా అందరూ చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. అతి తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చెయ్యడానికి ప్రతి టెక్నీషియన్ చాలా హెల్ప్ అయ్యారు. ఎప్పుడూ ఎవ్వరూ మమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. అశ్విన్, కళ్యాణ్ నా తమ్ముళ్ళు ఇద్దరూ నన్ను నమ్ముకుని నాతో ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడూ అశ్విన్‌ని హీరోని చెయ్యాలని, కళ్యాణ్‌ని ప్రొడ్యూసర్ చెయ్యాలన్నది నా కోరిక. రేపు 18న అశ్విన్ హీరోగా మీ ముందుకు వస్తాడు. ఇక కళ్యాణ్ బాధ్యత ఒకటి ఉంది.
మీరందరూ మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీళ్ళకు నేను తప్పితే ఎవ్వరూ లేరు. నాన్నగారూ లాస్ట్ ఇయర్ చనిపోయారు. అప్పటి నుంచి నేను వైట్ డ్రస్‌లో ఉంటున్నాను. తమ్ముళ్ళని హీరోగా చేసిన తర్వాతే ఈ డ్రస్ తీస్దాను. నన్ను ఆదరించినట్లే నా తమ్ముడు అశ్విన్‌ని రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను. చోటా అన్న నా కు ఒక అన్న మా ఫ్యామిలీ మెంబర్ అనే చెప్పాలి. ఇంత పెద్ద డిఒపి అయ్యుండి కూడా ఇప్పటికీ ఆయన ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ మాట్లాడలేదు. ఎవరైనా సరే సినిమా పూర్తయ్యాక డబ్బులు ఇస్తేనే కాపీ ని బయటకి ఇస్తారు. కాని ఆయన దాని గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఇంత పెద్ద డిఒపి కనీసం రెమ్యూనరేషన్ అడగలేదంటే అంత ఈజీకాదు. అలాగే డిస్ట్రిబ్యూటర్ వరంగంల్ శ్రీను ఆల్రెడీ రెండు హఆయన మా మీద పెట్టుకున్న నమ్మకంతో ఏమీ అడగలేదు. ఆయన చాలా లక్కీ హ్యాండ్ అనే చెప్పాలి. హిట్లు ఉన్నాయి. దీంతో ఆయన హ్యాట్రిక్ ని అందుకుంటారు. శ్రీను ది చాలా లక్కీ హ్యాండ్ కూడా అని అన్నారు.
అశ్విన్ మాట్లాడుతూ... నా డ్రీమ్ రేపు 18న చూడబోతున్నారు. జీనియస్ నుంచి నేను ఒక ఐదు చిత్రాల్లో చేశాను. కానీ చోటాగారి లాంటి పెద్ద టెక్నీషియన్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జూన్ 21న మొదలై ఇంత త్వరగా పూర్తవడానికి మొయిన్ కారణం కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ మమమల్ని ఇబ్బంది పెట్టలేదు. అందరూ ఇష్టపడి మమ్మల్ని బ్లస్ చేస్తారు అనుకుంటున్నాను అన్నారు.
అవికాగోర్ మాట్లాడుతూ... ఇదే మొదటిసారి నేను చాలా నెర్వస్‌గా ఫీవుతున్నాను. ఎందుకంటే ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌గా ఫీలవుతున్నాను. ఇది నా ఫ్యామిలీగా భావిస్తున్నాను. ఈ క్యారెక్టర్ని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. చోటాగారు, ఓంకార్బ్రదర్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం ఐయామ్ సోమచ్ థ్యాంక్ ఫుల్ టుహిమ్ అన్నారు.