ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్న‌ భీమవరం ఒకటి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌యంగా పోటీ చేసి ఓడిపోయారు. ఏకంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నే సాక్షాత్తూ ఇక్క‌డ పోటీ చేస్తే ఓడించిన నియోజ‌క‌వ‌ర్గంగా భీమ‌వ‌రం ప్ర‌జ‌లు ఓ రికార్డు క్రియేట్ చేశార‌నే చెప్పాలి. అలాంటి చోట ఈ సారి ప‌రిస్థితి ఎలా ఉంది ?  మ‌ళ్లీ గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ఓడించిన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసే విజ‌యం సాధిస్తారా ?  లేదా ?  ఈ సారి కూట‌మి నుంచి పోటీ చేస్తోన్న మాజీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు ( అంజిబాబు ) గెలుస్తారా ? అన్న‌దే ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గా మారింది.


ప‌వ‌న్ ఈ సారి ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రంలో పోటీ చేయ‌క‌పోయినా కూడా గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో స‌హ‌జంగానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అయితే ఈ సారి కూడా ప‌వ‌న్ ఇక్క‌డే పోటీ చేయాల‌ని అనుకున్నారు. ఆయ‌న చివ‌ర్లో పిఠాపురం నుంచి పోటీ చేయ‌డంతో భీమ‌వ‌రం నుంచి మాజీ ఎమ్మెల్యే అంజిబాబును పార్టీలో చేర్చుకుని సీటు ఇచ్చారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ప‌వ‌న్ పై పోటీ చేసి మూడో స్థానంలో ఉన్నారు. అంత‌కు ముందు అంజిబాబు ఇదే భీమ‌వ‌రం నుంచి ఓ సారి కాంగ్రెస్ త‌ర‌పున‌.. మ‌రోసారి టీడీపీ త‌ర‌పున రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.


ఇక 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు 70 వేల 643 ఓట్లు రాగా - పవన్ కళ్యాణ్‌కు 62 వేల 288 ఓట్లు - టీడీపీ తరఫున పోటీ చేసిన‌ రామాంజనేయులు 52 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే టీడీపీ, జనసేన ఓట్లు క‌లిపితే 44 వేల మెజార్టీతో జ‌న‌సేన గెల‌వాలి. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద రెండున్న‌ర ల‌క్ష‌ల ఓట్లు ఉన్నాయి. భీమవరం పట్టణంతోపాటు భీమవరం రూరల్‌, వీరవాసరం మండలాలు ఉన్నాయి. ఇద్ద‌రు కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన వారు.


జ‌గ‌న్ కాపుల‌ను ఎంత‌లా ఇబ్బంది పెట్టారో అన్న భావ‌న వారిలో ఉంది. ఈ సారి ప‌వ‌న్ కోసం కాపులంతా ఒక్క‌ట‌వుతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న క్ష‌త్రియులు కూడా ఎప్పుడో వైసీపీకి యాంటీ అయిపోయారు. ఇలా ఎలా చూసుకున్నా ఈ సారి భీమ‌వ‌రంలో జ‌న‌సేన జెండా ఎగిరే వాతావ‌ర‌ణం అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: