ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ మేనిఫెస్టో విషయంలో రాష్ట్రమంతా చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది.. ఈ రోజున వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తానని వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. తాజాగా తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అలాగే గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను సైతం 99 శాతం వరకు అమలు చేశామని తెలియజేశారు. మేనిఫెస్టోను పవిత్ర బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించే అమలు చేస్తున్నామంటూ తెలిపారు. ఇతర పార్టీల లాగా అమలు చేయలేనటువంటి హామీలు ఆచరణ సాధ్యం కానటువంటి పథకాలకు తాము మేనిఫెస్టోలో చోటు ఉండదని కూడా తెలియజేశారు.


అలాగే అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, రైతులకు కార్మికులకు, యువతకు, విద్యార్థులకు మేనిఫెస్టోలో  మంచి ప్రాధాన్యత కల్పించామని కూడా తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము  చేయకుండా అన్ని వర్గాలకు అందించేలా మేనిఫెస్టోను రూపొందించామంటూ కూడా తెలియజేశారు. ఈసారి మేనిఫెస్టోలో రెండు కొత్త  పథకాలను కూడా అమలు చేసినట్లుగా తెలుస్తోంది..

అసలు విషయంలోకి వెళ్తే వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో విషయం.. నవరత్నాలలో.. విద్య, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం తోపాటు పింఛన్ 3500 కు పెంపు రెండు విడతలలో.. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ. వైయస్సార్ ఆసరా అని కూడా కొనసాగిస్తామని.. వైద్యం విద్య విస్తరణ విషయంలో కూడా తీసుకుంటామని తెలుపుతున్నారు. జగనన్న అమ్మఒడి ప్రాజెక్ట్.. గతంలో 15 వేల రూపాయలు ఇచ్చింది.. ఇప్పుడు 17వేల రూపాయలకు పెంచారు.. వైయస్సార్ సున్నా వడ్డీ.. వైయస్సార్ ఆసరా కింద రూ .3లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీతో ఇవ్వడమే కాకుండా. రుణాల మీద ఇచ్చే వడ్డీ మరో 5 సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు.


వైయస్సార్ చేయూత కింద 75,000 వేల నుంచి 1,50,000 వరకు పెంపు.. కళ్యాణమస్తు, షాది తోఫా ఈ ఐదేళ్లు కూడా కొనసాగుతుందని తెలిపారు. అలాగే ఇళ్ల పట్టాల విషయంలో కూడా మళ్లీ ఐదేళ్లు కొనసాగుతుంటుందని తెలిపారు. మరికొన్నిటిని కొనసాగిస్తున్నామంటూ తెలియజేశారు. రైతన్నలకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము 13,500 ఇచ్చేవారు.. ఈసారి 16,500 వేల రూపాయలకు పెంచారు.. వాహన మిత్ర విషయంలో.. కొనసాగిస్తామని తెలిపారు. లారీ డ్రైవర్లకు టిప్పర్ డ్రైవర్లకు కూడా ఈసారి ఇస్తామని తెలిపారు.అలాగే లానేస్తాన్ని కూడా గతంలో లాగానే కొనసాగిస్తామని తెలిపారు. యువత, ఉపాధికి సంబంధించి.. స్కిల్ హబ్బులను మొదలు పెడతామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: