గత కొంత కాలంగా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్న తీరు ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ అభిమానులకు దూరమైన బన్నీ తరిగి వారిని ప్రసన్నం చేసుకోవడానికి చాల కష్టపడవలసి వచ్చింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘సైరా’ మూవీ విషయంలో కూడ చాల ఆలస్యంగా బన్నీ స్పందించడంతో చిరంజీవి అభిమానులు బన్నీ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త పరిచారు. 

ఇదే పరిస్థితులను కొనసాగిస్తూ బన్నీ మహేష్ తో సంక్రాంతి వరకు ఒకేరోజు వస్తున్న నేపధ్యంలో మహేష్ అభిమానులు అల్లు అర్జున్ పై చాల తీవ్ర అసహనంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో బన్నీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడ్డ కొన్ని ఫ్లెక్సీల వెనుక ఎవరి హస్తం ఉంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘తెలుగు ప్రేక్షకుల అభిమానంతో స్టార్ అయ్యావు కానీ తెలుగు సినిమా కార్మీకులకు అన్యాయం చేస్తున్నావు’ అంటూ తెలుగు సినీ కార్మికుల ఐఖ్యత వర్ధిల్లాలి అంటూ పెట్టిన బన్నీ వ్యతిరేక బ్యానర్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. సినిమా కార్మికుల సంఘానికి సంబంధించి కానీ వారి సమస్యలు గురించి కానీ ఎప్పుడు అల్లు అర్జున్ పోరాడిన సందర్భాలు లేవు. 

దీనితో తెలుగు సినిమా కార్మికులకు బన్నీకి ఏమిటి సంబంధం కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది అంతా సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీ వార్ కు సంబంధించిన నెగిటివ్ ప్రచారమని ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఫెయిల్ అయినా భవిష్యత్ లో పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు తగ్గి తద్వారా తెలుగు సినిమా కార్మీకులు నష్టపోతారు అంటూ పెట్టిన బ్యానర్స్ మాత్రమే అంటూ కొందరు సద్ది చెపుతున్నారు. జరుగుతున్న బన్నీ పై ఎదో కుట్ర జరుగుతోంది అంటూ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: