ప్రతీ దానికి అర్ధం పరమార్ధం ఉంటుంది. ఎవరు ఏం చేసినా దాని వెనక ఒక టార్గెట్ ఉంటుంది. చూసే కన్నుకి అందం గన్ను గురిపెట్టి కొట్టేది కూడా అందుకోసమేనట. విషయానికి వస్తే చాన్సులు లేక బ్యాక్ బెంచ్ కి వెళ్ళిపోయిన హీరోయిన్లకు ఇపుడు మంచి అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. అదెలా అంటే పెరిరిన సాంకేతికత ఇస్తున్న ఆఫర్లు అవి. దాని కోసమే చాలా మంది హీరోయిన్లు ఇపుడు సోషల్ మీడియా వేదిక గా  తమ అందాలను ఒక్కసారిగా ఆరబోస్తున్నారు.


ఇపుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ఊపందుకోవడంతో కొత్త కంటెంట్‌ కోసం కంపెనీలు ఇపుడు  పోటీలు పడుతున్నాయి.  స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై అడల్ట్‌ థీమ్‌ వున్న వాటికే ఆదరణ బాగుండడంతో అలాంటి షోలు, వెబ్‌ సిరీస్‌లు చేయడానికి కంపెనీలు దూసుకువస్తున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం అవకాశాలు లేని హీరోయిన్లకీ గాలం వేస్తున్నాయట. దాంతో సోషల్ మీడియాలో ఎటువంటి బిడియం లేకుండా అందాన్ని అలా పారేస్తున్న హీరోయిన్లకు ఈ కంపెనీలు పిలిచి మరీ పెద్ద పీట వేస్తున్నాయి. షరతులు మాత్రం ఇక్కడ వర్తిస్తున్నాయట. అదేంటి అంటే ఎలాగైనా చేయాలి. అందులో అరమరికలు ఉండవు. ఒక్కసారి  సైన్ చేశాక నా వల్ల కాదు అంటే కుదరదు, అందాల ఆరబోత విషయంలో అల్టిమేట్ అని ఎవరైతే ఉంటారో వారికే చాన్సులు వరసగా వరదలా  దక్కుతున్నాయట.


నగ్నత్వం కానీ నగ్నత్వాన్ని  వెబ్ సిరీస్ ద్వారా చూపించాలన్నది ఈ కంటెంట్ మేకర్ల ఉద్దేశ్యం. దీనికే కాసులు రాలుతున్నాయి. ఇక ఒక భాషలో తీసిన దాన్ని మొత్తం భారతీయ భాషల్లోకి అనువదించి మరీ రిలీజ్ చేసుకోవచ్చు. అందువల్ల పెట్టుబడి వెనక్కు వచ్చెస్తుంది. దాంట్లో ఢోకా ఎక్కడా లేదు. దాంతో ఇపుడు వెబ్ సిరీస్ కంటెంట్ మేకర్లు  వేడి వేడి అందాల కోసం గాలిస్తున్నారు. వారికి తగినట్లుగా సినిమా చాన్సులు రాని హీరోయిన్లు తమ అందాలతో పందేలు వేస్తున్నారు. మరి చూడాలి వెబ్ సిరీస్ లో వీరంతా మెరిసిపోతారన్న మాట. రెండు విధాలుగా కలసి వస్తున్న ఈ కొత్త వేదికపైన ఇపుడు హీరోయిన్ల కన్ను పడుతోందట.
.



మరింత సమాచారం తెలుసుకోండి: