ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తర్వాత వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా డిస్కో రాజా. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటించారు. సైన్స్ ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. వాస్తవంగా ఈ సినిమా మీద రవితేజ గాని దర్శకుడు గాని ముందునుంచి మంచి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా రవితేజ ఇప్పటివరకు ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు. దాంతో హిట్ పక్కా అని అంచనా వేశారు. 

 

ఇక దర్శకుడు వి,ఐ ఆనంద్ ఎంచుకున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీ వరకు బాగున్నప్పటికి ఎప్పటిలాగే అన్ని సినిమాల మాదిరిగానే మిగతా కథ, స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగడంతో సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికి దాన్ని రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా రెగ్యులర్ ఫార్మాట్ లో మార్చడంతో ఆడినస్ బాగా డిసప్పాయింట్ అయ్యారట. ఇక వి.ఐ.ఆనంద్ రాసుకున్న రొటీన్ ట్రీట్మెంట్ సినిమా అంచనాలను అందుకోవడంలో గాడి తప్పిందని అభిప్రాయపడుతున్నారు.

 

ఇక సినిమాలో మొత్తంగా చూసుకుంటే రవితేజ పర్ఫార్మెన్స్ తప్ప చెప్పడానికి, చెప్పుకోవడానికి కొత్త విషయాలేమి లేవని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్ గా ఉన్నప్పటికి ఆ గ్లామర్ కథకి పనికిరాదని అంటున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలు సక్సస్ అవడంతో పాటు వి.ఐ.ఆనంద్ చెప్పిన సైఫై కాన్సెప్ట్ నచ్చి ఒకే చేస్తే అది బెడిసికొట్టిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 

ఇక రవితేజ సినిమాలో ఒకలా బయట ఒకలా కనిపించడం కూడా కాస్త మైనస్ గా మారింది. ఎంత ట్రై చేసిన రవితేజ ఏజ్ బాగా తెలిసిపోతోంది. అయితే అసలే హిట్స్ లేవు వయసు కూడా అయిపోతుంది ..ఏవో నాలుగు హిట్స్ కొడదామనుకుంటే ఈ కాన్సెప్ట్ చెప్పి నన్ను టెంప్ట్ చేసి ఒక్క తొక్కు తొక్కావ్ కదా అంటూ దర్శకుడి విషయంలో మాస్ రాజా ఫీలవుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: