ప్రేమ కథలు ఎక్కడ ఎవరెవరికి మధ్య మొదలవుతున్నాయో అవి ఎక్కడిదాకా వెళుతున్నాయో మధ్యలో ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో ఎవరు ఊహించలేరు. అసలు అలా ఊహించాలనుకోవడం ఒకరకమైన పిచ్చి. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ అనే పదానికే అర్థం మార్చేశారు కొందరు మహానుభావులు. కార్లల్లో కలిసి తిరిగి బీచ్ లలో బట్టలు లేకుండా ఫోజులిచ్చి, హోటల్ గదిలో గడిపితే అది ప్రేమ అంటున్నారు. సంబంధం లేకుండా ప్రేమ అనే గొప్ప పదానికి మరకలు అంటిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు స్టార్ హీరో హీరోయిన్స్, క్రికెటర్స్ ...చాలా మంది తయారయ్యారు. 

 

గత కొంతకాలంగా కొంతమంది క్రికెట్ స్టార్స్ హీరోయిన్స్ తో డేటింగ్.. లవ్ కొనసాగించిన విషయం తెల్సిందే. కొందరూ టైం పాస్ కి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కొందరు పెళ్లి వరకు వెళ్లగా కొందరు మాత్రం డేటింగ్ ప్రేమ వరకే ఆగిపోయారు. రెండు మూడు దశాబ్దాలుగా క్రికెట్.. సినిమా రంగంకు మద్య సంబంధాలు బాగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా రెండు మూడు ప్రేమ కథలు ఇలా కొనసాగుతూ ఉన్నాయి. టీం ఇండియా ఆటగాడు సురేష్ రైనా గతంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాలీ బింద్రెతో  డేటింగ్ కు వెళ్లాలని అనుకున్నాడట.

 

గత ఏడాది నుండి గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న సురేష్ రైనా ఐపీఎల్ తో మళ్లీ తన సత్తా చాటి జాతీయ టీంలో చోటు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా సురేష్ రైనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. అప్పట్లో సోనాలీ బింద్రె అంటే చాలా ఇష్టం. ఆమెతో డేటింగ్ కు వెళ్లాలని కూడా చాలా ఆరాటపడ్డాను. కాని కుదరలేదు అన్నాడు. కాని ఒకానొక సమయంలో ఆమె నుండి ఒక మంచి మెసేజ్ నాకు వచ్చింది. ఆ మెసేజ్ నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని సురేష్ రైనా పేర్కొన్నాడు. ఇంతకి ఆ మేసేజ్ లో ఏముందో మాత్రం తెలపలేదు.

 

అయితే ఇది విన్న నెటిజెన్స్ మాత్రం ఆ మెసేజ్ లో సోనాలి బేందే సురేష్ రైనా కి డేట్ కి డేట్ ఇచ్చిందని, సురేష్ అంటే తనకీ ఇష్టమంటూ మెసేజ్ లో తెలిపిందని .. తన క్రికెట్ ఆట ని బాగా ఎంజాయ్ చేస్తానంటూ పొగడ్తలతో ముంచేసిందని అనుకుంటున్నారు. అంతేకాదు సోనాలి సురేష్ తో స్నేహం కొనసాగించాలని అనుకుంటున్నట్లు కూడా తను పంపిన మేసేజ్ లో ఉన్నట్టు చెప్పుకుంటునారు. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటిటంటే సోనాలి మిడ్ నైట్ 12 తర్వాత సోనాలి  బేంద్రే ఈ మెసేజ్ ని రైనా కి పంపిందట. ఆ రోజు రాత్రి సురేష్ కి నిద్ర పట్టక గింజుకున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: