గత కొద్ది రోజులుగా గోవా బ్యూటీ ఇలియానా బీచ్‌లో అందాలు ఆరబోస్తూ వరుస ట్వీట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కవుగా ప్రయాణాలు ఇష్టపడే ఇలియానా తన సినిమా అప్డేట్స్ కన్నా తన హాలీడే మూమెంట్స్ నే అభిమానలతో షేర్ చేస్తూ ఉంటుంది. కొద్ది రోజుల పాటు బీచ్‌లలో ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ తిరిగి ముంబై చేరుకుంది. తన రెగ్యులర్ బిజీ లైఫ్‌లో అడుగుపెడుతూ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరిస్ను పోస్ట్ చేసింది.
ఫస్ట్ స్టోరిలో తాను బీచ్‌ల నుంచి రిటర్న్ అయినా.. తను ఇంకా ఆ అలలను ఫీల్ అవుతున్నానంటూ కామెంట్ చేసింది. అయితే ఆ ఫోటోలో ఇలియానా అందాలు ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అన్ని రోజుల పాటు బీచ్‌లలో గడిపినా ఇలియానా స్కిన్ ఏ మాత్రం టాన్ కాలేదు.
అయితే మరో స్టోరిలో బీచ్ వల్ల మన స్కిన్ టాన్ కాకపోతే.. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ వాడి మనమే ఇలా ముఖం టాన్ అయినట్టుగా చూసుకోవాలి అంటూ ఓ ఫన్నీ ఫోటోను పోస్ట్ చేసింది ఇలియానా.ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల తెలుగులో అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు మరోసారి నిరాశే మిగిలింది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ బిగ్ బుల్లో నటిస్తోంది ఇలియానా.