హాట్ బ్యూటీ బ్రిట్నీ స్పియర్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. అల్‌బర్డ్‌ ఐన్‌స్టీన్‌ చెప్పిన ఓ కొటేషన్‌ను ఉదహరిస్తూ తన చేతి మీద ఉన్న టాటూను ఉంచాలా తీసేయాలా అని అభిమానులను కోరింది.

 

బ్రిట్నీ 2004లో ఫెడర్లైన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అదే సమయంలో వెకేషన్‌లో భాగంగా తన భర్తతో కలిసి మ్యాచింగ్‌ టాటూను తన మనికట్టు మీద వేయించుకుంది. అయితే వీరి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. మూడేళ్లకే విభేదాలతో 2007లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బ్రిట్నీ సాం అస్గరితో డేటింగ్ చేస్తోంది.

 

అయితే ఇన్నేళ్ల తరువాత తన మాజీ భర్తతో కలిసి వేయించుకున్న టాటూను చెరిపేసుకోవాలని భావిస్తోంది ఈ పాప్‌ బ్యూటీ. హాలీవుడ్‌లో నటిగా, గాయనిగా, లిరిసిస్ట్‌గా, కొనసాగుతున్న బ్రిట్నీ అదే స్థాయిలో సోషల్‌ మీడియాలోనూ హల్‌ చల్‌ చేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Albert Einstein once said "God does not play dice with the universe" …. so maybe I shouldn’t have gotten the pink dice 7 on my left arm 🤔🤔🤔🤔🎲🎲 !!!!! I don’t even like ink …. guess I should remove it ?!?!!!!

A post shared by Britney Spears (@britneyspears) on

మరింత సమాచారం తెలుసుకోండి: