ఒక‌ప్పుడు ఇద్ద‌రు హీరోలు క‌లిసి మంచి రేంజ్‌లో ఉండ‌గా మ‌ల్టీస్టార‌ర్ చేశారు. ఎవ‌రా అనుకుంటున్నారా... ఆ ఇద్ద‌రూ  కూడా ఎవ‌రో కాదు ఒక‌రు హీరో కృష్ణ‌, మ‌రొక‌రు శోభ‌న్‌బాబు  వీరిద్ద‌రూ క‌లిసి ఎన్నో చిత్రాల్లో క‌లిసి హీరోలుగా న‌టించారు. ఇక వీరిద్ద‌రూ ఎంత ప్రా ణంగా ఉండేవారంటే అంత ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. హీరో కృష్ణ అప్ప‌ట్లో చాలా మందికి మంచి అభిమాన హీరోగా ఉండేవారు. అలాగే శోభ‌న్‌బాబుని చాలా మంది వారి ఇంట్లో మ‌నిషిలా చూసేవారు. ఎందుకంటే శోభ‌న్‌బాబు అంత అందంగా ఉండేవారు. ఉదాహ‌ర‌ణ‌కి శోభ‌న్‌బాబు లాంటి కొడుకుపుట్టాలి. అచ్చం శోభ‌న్‌బాబు లాగా ఉన్నావ్‌. మా అన్న‌య్య శోభ‌న్‌బాబులాగా అంద‌గాడు అని అంటారు. ఎందుకంటే శోభ‌న్‌బాబు ఎక్కువ‌గా ఫ్యామిలీ మూవీస్‌లో న‌టించేవారు. దాంతో ప్ర‌తి ఇంట్లో శోభ‌న్‌బాబును వాళ్ళ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాగా భావించేవారు.

 

 ఒక సూప‌ర్‌స్టార్ హీరోలాంటి కొడుకు ఉన్న‌ప్ప‌టికీ ఆమె త‌ల్లి నా పెద్ద కొడుకు శోభ‌న్ బాబు అనేది ఆ త‌ల్లి అంత మంచి అభిప్రాయం శోభ‌న్‌బాబు  మీద ఉండేది. అది ఎలాగంటే ఆయ‌న ఎంచుకునే పాత్ర‌లు  అలా ఉండేవి. అలాగే ఒకానొక స‌మ‌యంలో `కురుక్షేత్రం` చిత్రంలో ఆయ‌న కృష్ణుడు పాత్ర‌లో న‌టించాడు. అప్పుడు ఆ పాత్ర‌లో ఆయ‌న‌ను చూసిన‌ప్పుడు చాలా మంది నిజంగా భ‌గ‌వంతుడే దిగి వ‌చ్చాడా అన్నంత బాగా సెట్ అయ్యాడు. దాంతో అప్ప‌టి నుంచి కృష్ణ త‌ల్లి త‌న ఇంట్లో శోభ‌న్‌బాబు ఫొటో పెట్టుకునేది. శోభ‌న్‌బాబును త‌నే నా పెద్ద‌కొడుకు అని ఎంతో గ‌ర్వంగా చెప్పుకునేది. శోభ‌న్‌బాబు అంటే కృష్ణ త‌ల్లికి అంత ఇష్ట‌మ‌ట‌.  అలాగే శోభ‌న్‌బాబు ప‌ద్ధ‌తి కూడా చాలా ఖ‌చ్చితంగా ఉండేది. ఏ విష‌యంలోనైనా ఎంతో డిసిప్ల‌యిన్‌గా ఉండేవార‌ట‌. ఇక ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఎన్నో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించారు. అప్ప‌ట్లో కురుక్షేత్రంలో జ‌రిగే ఓ ఫైట్ కోసం లండ‌న్ నుంచి కెమెరాలు తెప్పించి మ‌రీ ఆ ఫైట్‌ని షూట్ చేశార‌ట‌.

 

అలాగే ఆ త‌ర్వాత  కృష్ణ, శ‌భ‌న్‌బాబు వీరిద్ద‌రి మ‌ధ్య కూడా కొంత పోటీ అనేది ఉండేది. కృష్ణ దాదాపు 300 పై చిత్రాల్లో న‌టించారు. శోభ‌న్‌బాబు అన్ని చిత్రాల్లో న‌టించ‌న‌ప్ప‌టికీ ఆయ‌న ఎక్కువ ఫ్యామిలీ మూవీస్‌లో న‌టించేవారు. దాంతో శోభ‌న్‌బాబుకి ఎక్కువ‌గా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఉండేవారు. అంతేకాక అప్ప‌ట్లో వీరిద్ద‌రూ క‌లిసి కొన్ని మ‌ల్టీస్టార‌ర్ గా న‌టించిన చిత్రాలు ఎన్నో మండేగుండెలు, ముంద‌డుగు, కృష్ణార్జునులు, మ‌హాసంగ్రామం, ఇద్ద‌రు దొంగ‌లు వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు.  అప్ప‌ట్లో టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు వీరు న‌టించిన‌ట్లు ఇంకే హీరోలు క‌లిసి న‌టించ‌లేద‌నే చెప్పాలి.  ఆ త‌ర్వాత శోభ‌న్‌బాబు న‌టించిన ముగ్గురు మొన‌గాళ్ళు చిత్రం హిట్ అయింది. అప్పుడు వీరిద్ద‌రి ఫ్యాన్స్ మ‌ధ్య కాస్త తేడా వ‌చ్చింది. ఏ విధంగా అంటే శోభ‌న్‌బాబు ఫ్యాన్స్ కృష్ణ‌లాగా చేస్తున్నాడు మా హీరో కూడా అని అనేవార‌ట‌. అలా చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చేవ‌ట‌. కానీ ఆత‌ర్వాత న‌టించిన‌ రాజ్‌కుమార్ ఫ్లాప్ అయింది. అంతేకాక శోభ‌న్‌బాబు, కృష్ణ ఇద్ద‌రూ కూడా బ‌య‌ట ఎంతో మంచి ఫ్రెండ్స్‌. అలాగే శోభ‌న్‌బాబు వాళ్ళ అమ్మ ఎప్పుడూ కృష్ణ ఫొటో పెట్టుకుని నా పెద్ద‌కొడుకు అన‌డ‌మ‌నేది ఎంతో విచిత్ర బంధం అని చెప్పాలి. వారిద్ద‌రూ అంత అమిత‌మైన ప్రేమ‌తో ఉండేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: