క‌న్‌స్ట్ర‌క్ష‌న్ విభాగం నుంచి సినిమా రంగం పైన ప్యాష‌న్‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు నిర్మాత రామ‌కృష్ణ (ఆర్‌.కె.) ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌  బ్యానర్స్‌పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీరామస్వామి (ఎమ్‌.ఆర్‌) దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ ల‌వ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌ ‘ప్రేమపిపాసి’. ఇక ఈచిత్రం సెన్సార్ ప‌నుల‌న్నీ పూర్తి ఈ నెల 13న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.  ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ(ఆర్‌.కె)తో...

 

మీ సొంత ఊరు...
` మాది విజయవాడ. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. నా చదువంతా కాకినాడలోని సాగింది. ఎం.కామ్‌, ఎంబీఏ చదివాను. 2000 లో హైదరాబాద్‌ వచ్చాను. గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. అలాగే గత పదేళ్లుగా  కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేస్తున్నాను.  2010 చిన్నగా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాను. క్రమంగా డెవల‌ప్‌ చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గర పెద్ద ప్రాజెక్ట్‌ ఒకటి కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నాను. గతం లో ఒక  షార్ట్ ఫిలిం లో నటించాను. అలాగే  నిర్మాతగా కూడా వ్యవహరించాను. మా హీరో, డైరెక్టర్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఈ రంగంలో అడుగుపెట్టాను.

 

సినిమా పై ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుంది...
 మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేం చేసిన ట్రైర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాను చూసిన వారందరూ బావుందని మెచ్చుకున్నారు. అలాగే సినిమా సెన్సార్‌ కూడా పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్‌ అధికారా ఈ సినిమా బావుందని అప్రిషియేట్‌ చేశారు. మార్చి 13న సినిమాను విడుదల‌ చేస్తున్నాం.  సినిమా చేయడం ఒక ఎత్తు అయితే.. సినిమా రిలీజ్‌ చేయడం మరో ఎత్తు అని ఈ సినిమాతో తెలిసింది.

 

సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌ ఏంటి...
`ఏదయినా సినిమాకి ఆడియన్స్ రావాలంటే ముఖ్యంగా కథ, ఎంటర్ టైన్మెంట్, సంగీతం బాగుండాలి. మా సినిమాలో ఇవి చక్కగా కుదిరాయి. వాటితో పాటు స్టూడెంట్స్ కి కావాల్సిన బోల్డ్ కంటెంట్ కూడా ఉంది. అందుకనే సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కథాను సారంగానే బోల్డ్ కంటెంట్ పెట్టడం జరిగింది.  

నిర్మాతగా మీకు ముందు ముందు ఎలాంటి సినిమాలు చేయానుకుంటున్నారు...
` ఏడాదికి ఓ సినిమా చేసినా మా బ్యాన‌ర్ నుంచి మంచి సినిమా రావాల‌న్న‌దే నా కోరిక‌. మంచి సినిమా వస్తుందని ప్రేక్షకుడు అనుకోవాలి. అన్నీ జోనర్‌ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం ముగ్గురు దర్శకుల‌తో చర్చ‌లు జరుపుతున్నాం. త్వ‌ర‌లోనే ఏ కథతో సినిమా చేయాల‌నే దానిపై ఓ నిర్ణయం తీసుకుని తెలియజేస్తాను అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: