నాచురల్ స్టార్ నాని తన సినిమా ఎంపిక విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటాడు. అష్టా చమ్మ నుండి రాబోతున్న వి వరకు నాని సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కొన్నాళ్ళు కథల విషయంలో కొన్ని పొరపాట్లు చేసి చాలా వెనుకపడ్డాడు. మొహమాటానికి పోయి సినిమాలు చేస్తే ఫలితంగా కెరియర్ లో తను వేనుకపదాల్సి వచ్చింది. ఎలాగోలా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడనుకోండి. ప్రస్తుతం నాని సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అన్నట్టే. ఇటీవల వచ్చిన ఒక సినిమా అసలైతే నాని చేయాల్సిందట. కాని నానిసినిమా వర్క్ అవుట్ అవదని దర్శకుడికి ముందే చెప్పాడట.

 

కట్ చేస్తే ఆ సినిమా వేరే యువ హీరో చేయగా ఫలితం డిజాస్టర్ అయ్యింది. నాని చెప్పినట్టుగానే ఆడియెన్స్ కూడా ఆ సినిమాను రిసీవ్ చేసుకోలేదు. నాని కథ చెప్పిన టైం లో దర్శకుడికి కొన్ని సలహాలు ఇచ్చాడట. కథలో ఈ మార్పులు చేస్తే తానూ చేస్తానని అన్నాడట కాని నాని మాటలు పెడచెవిన పెట్టిన ఆ డైరక్టర్ ఇప్పుడు నాలుక కొరుక్కుంటున్నాడు. నాని చెప్పినట్టుగా చేంజెస్ చేస్తే ఒకవేళ సినిమా ఆడేదేమో అని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అయినా జరిగిందంతా జరిగాక ఇప్పుడు అనుకుని ఏం లాభం చెప్పండి.

 

అయితే ఆ సినిమాకు విపరీతంగా కష్టపడిన యువ హీరో మాత్రం ఈ సినిమా రిజల్ట్ వల్ల చాలా డిస్ట్రబ్ అయ్యాడట. బ్యాక్ టూ బ్యాక్ రెండు ఫ్లాపులు పడటంతో కెరియర్ రిస్క్ లో పడ్డది. ఇక ఆ డైరక్టర్ అయితే ఇక పెట్టా బేడా సర్దేయాల్సిందే. నాని చేయనని చెప్పినప్పుడు సినిమాలో కొన్ని చేంజెస్ చేసి ఉంటే బాగుండేది. కాని అలా చేయకుండా సినిమా చేసి అటు హీరో.. నిర్మాత అందరిని ఇబ్బంది పెట్టాడు దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: