మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అల్లు అర్జున్.   గంగోత్రితో తన ప్రస్థానం మొదలు పెట్టిన అల్లు అర్జున్ తర్వాత దేశముదురు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు,. ఆ తర్వాత వరుస విజయాాలు అదుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రంలో నటించాడు.  ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  త్వరలో సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు.  అల్లు అర్జున్ తన బాడీగార్డు పుట్టినరోజు వేడుక నిర్వహించడం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అరణ్యం నేపథ్యంగా సాగే సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

మొదటి నుంచి తన ఆత్మీయులుగా ఉన్నవారి వేడుకల్లో అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంతో తన బాడీగార్డు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.  అయితే ఇప్పటి వరకు సుకుమార్  డైెరెక్షన్ లో బన్నీ మాస్ లుక్ తో కనిపిస్తారని వినడమే చూడలేదు. కానీ ఈ పుట్టిన రోజు వేడుకలో చూస్తుంటే బన్నీ ఊర మాస్ లుక్ లో కనిస్తున్నట్లు అర్థం అవుతుంది.  సుకుమార్ దర్శకత్వంలో అరణ్యం నేపథ్యంగా సాగే సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

 

బాగా గడ్డం పెంచి రఫ్ లుక్ తో ఉన్న బన్నీ తన బాడీగార్డు బర్త్ డే పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతడితో కేక్ కట్ చేయించడమే కాదు, ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.  నా పేరు సూర్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటే మాత్రం ఇక టాలీవుడ్ లో బన్నికి ఎదురేలేదు అంటున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఫొటోల్లో బన్నీని చూసిన వారు, సుకుమార్ సినిమాలో లుక్ ఇదేనని కన్ఫామ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: