కరోనా మహమ్మారితో సామాన్య ప్రజల దగ్గరనుంచి సీ ఎం వరకు అందరిలో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అటు ఏ పి ఇటు తెలంగాణా ప్రభుత్వాలు కంగారు పడుతున్నాయి. కరోనా వైరస్ ని అరికట్టేందుకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలై.. కాలేజీలకు ఈ నెల 31 వరకు సెలవులను ప్రకటించింది. ప్రాణాలు తీస్తున్న కరోనా ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయం. శనివారం సీఎం కేసీఆర్ నేతృత్వం లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జన సమూహాలు ఉండే చోట్లను బ్లాక్ చేయాలని నిర్ణయించుకోవడం తెలంగాణా రాష్ట్రం అంతా సంచలనమవుతోంది.

 

ఈ నేపథ్య్మలో తాజాగా జరిగిన సమావేశంలో కొన్ని కీలక అంశాల్ని చర్చించారు. ముఖ్యంగా ఈ నెలఖారు వరకు ఫంక్షన్ హాల్స్.. స్కూల్స్.. కాలేజీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాదు వీటితో పాటు సినిమా థియేటర్లను మూసివేయాలన్న నిర్ణయం తో అందరు షాకవుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు ఒకరంగా ఇప్పటి వరౌ ఎప్పుడు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవలేదని అందరికీ తెలిసిందే. 

 

అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద అని చెప్పాలి. ఎన్నో సినిమాలు విడుదలకి నోచుకోవడం లేదు. కోట్లతో జరగాల్సిన వ్యాపారం కుదేలయింది. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకొని 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో భారీగా లాభాలని తెచ్చి పెడుతుందనుకున్న భీష్మ సినిమా కి కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడింది. కరోనా వ్యాపిస్తుందన్న భయంతో జనాలు థియోటర్స్ కి వెళ్ళకుండా అగిపోయారు. దాంతో మేకర్స్ కి గట్టి దెబ్బ పడింది. ఈ ఒక్క సినిమానే కాదు త్వరలో రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలకి బ్రేక్ పడింది.

 

అసలెన్ని రోజులు ఈ కరోనా ఎఫెక్ట్ ఉంటుందో తెలీక భయంతో బయటకి రావాలంటే వణికిపోతున్నారు. కోట్ల వ్యాపారం జరిగే సినిమా ఇండస్ట్రీకి కరోనా ఆ కోట్ల ని కాజేస్తుందని ఇండస్ట్రీలో మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంలో జనాలు ఈ వైరస్ ని వ్యాపింపజేసిన చైనా వాళ్ళని నిర్ధాక్షణంగా ఉరితీసినా తప్పులేదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: