తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ వరుస వాయిదా పడుతున్నాయి.  స్టార్ హీరో నుంచి చిన్న నటుల చిత్రాలన్నీ వాయిదా వేసుకుంటున్నారు.  రత్ లో ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో సినిమా థియేటర్లు, సినిమా షూటింగులు అన్నీ నిలిపివేశారు.  ఇప్పటికే భారత్ లో ఇప్పటికే రెండు మరణాలు సంబవించాయి. ఎనభై కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.  ఈ నేపథ్యంలో రాష్టాల్లో థియేటర్లు మూసివేతకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.  తెలంగానలో సైతం థియేటర్లు మూసి వేసిన విషయం తెలిసిందే.  దేశంలోని అన్ని ఫిలిం ఇండస్ట్రీలు షూటింగుల నిలిపివేతపై ఏకాభిప్రాయానికి వచ్చాయి.

 

దేశవ్యాప్తంగా సినిమా షూటింగులే కాదు, బుల్లితెర సీరియళ్ల చిత్రీకరణ కూడా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోనుంది.  అయితే సాంకేతిక వర్గాల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దు అని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసిందే.  డిజిటల్ షోలు, వెబ్ సిరీస్ ల షూటింగులు కూడా బంద్ కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే షాపింగ్ మాల్స్, స్కూల్స్, కళాశాలలు అన్నీ మూసివేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా, హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. సోమవారం నుంచి షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ సమావేశంలో ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, మా యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, కార్యదర్శి జీవిత తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్ లు వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే.  కరెోనా మహహ్మారి ప్రబలిపోతున్న నేపథ్యంలో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో బుల్లితెరపై వస్తున్న సీరియల్స్ షూటింగ్స్ కూడా వాయిదాలు వేసుకుంటున్నారు. దాంతో ఇఫ్పుడు వెండితెర, బుల్లితెరపై ఎంట్రటైన్ మెంట్స్ ఇబ్బందే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: