మహేష్ వంశీ పైడిపల్లిమూవీ క్యాన్సిల్ కావడంతో ప్రస్తుతం వంశీ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ‘మహర్షి’ మూవీ తరువాత మహేష్ ను నమ్ముకుని ఏడాది గడిపిన వంశీకి ప్రస్తుతం టాప్ హీరోలు ఎవ్వరు అందుబాటులో లేకపోవడంతో మరో సంవత్సరం గ్యాప్ ఈ డైరెక్టర్ కి ఏర్పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 


ఇప్పటి వరకు వంశీ పైడిపల్లికి ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి ఆఖరి నిముషంలో మహేష్ ఇచ్చిన హ్యాండ్ అని భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆలస్యంగా అసలు కారణం వెలుగులోకి వచ్చింది. మహేష్ వంశీల మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడానికి పరోక్షంగా నాగార్జున కారకుడు అని అంటున్నారు. 


తెలుస్తున్న సమాచారం మేరకు వంశీ పైడి పల్లి స్టోరీ క్రియేషన్ టీమ్ లో సాల్మన్ హరి అనే ఇద్దరు స్క్రిప్ట్ రైటర్స్ కీలకం అని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబాయ్ నుండి వచ్చిన సాల్మన్ కు మూవీ స్క్రీన్ ప్లే విషయంలో చాల పట్టు ఉంది అని అంటారు. ‘మహర్షి’ సినిమాకు సంబంధించిన కథ అంతా సాల్మన్ క్రియేట్ చేసాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో సాల్మన్ వంశీ పైడిపల్లిని విడిచిపెట్టి నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీకి దర్శకుడుగా మారడంతో వంశీ పైడిపల్లికి కథ విషయంలో అన్ని విధాల సహకరించే సాల్మన్ సపోర్ట్ పోయింది. దీనితో కొత్త రైటర్స్ తో వంశీ పైడిపల్లి మహేష్ తో అనుకున్న కథకు స్క్రిప్ట్ తయారు చేయించాడట. 


అయితే వంశీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కొత్త టీమ్ తయారు చేసిన కథతో మహేష్ ను మెప్పించలేకపోవడంతో విసుకు చెందిన మహేష్ వంశీ మూవీని క్యాన్సిల్ చేసాడు అని అంటున్నారు. దీనితో మహేష్ లాంటి టాప్ హీరోతో మంచి సాన్నిహిత్యం ఉన్నా తన దగ్గర కుడి భుజం లా పనిచేసే సాల్మన్ వెళ్ళిపోవడంతో ప్రస్తుతం వంశీ పైడిపల్లి పరిస్థితి అయోమయంలో పడిపోయింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: