బాలీవుడ్‌లో హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్లు సర్వసాధారణం. కానీ మన దక్షిణాది సినిమా రంగంలో హీరో హీరోయిన్స్ కు మధ్య ఎఫైర్లకు సంబంధించి వార్తలు అంత విరివిగా వినిపించవు ‘శుద్ధు దేశీ రొమాన్స్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ తన హాట్ లుక్స్ తో ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమెను హీరోయిన్ గా పెట్టి నాని హీరోగా యాష్ రాజ్ ప్రొడక్షన్స్ తమకు బాలీవుడ్ లో సూపర్ హిట్ ఇచ్చిన ‘బ్యాండ్ బాజా బరత్’ సినిమాను తెలుగులో ‘ఆహా కళ్యాణం’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే
ఈ సినిమాను కోలీవుడ్ లో కూడా విడుదల చేస్తున్నారు. వాలెంటైన్ కు విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది. దక్షిణాది సినిమా రంగంలో యాష్ రాజ్ సంస్థకు ఇది తొలి సినిమా కావడంతో ఈ సినిమా పబ్లిసిటీని వాణి కపూర్ చేత చెన్నైలో ఈ మధ్య భారీగా చేయించారు.
ఈ ప్రమోషన్ లో భాగంగా వాణి కపూర్ ను కోలీవుడ్ మీడియా ‘మీకు నానీతో ఎఫైర్ ఉందట కదా’ అని మీడియా అడిగిన ప్రశ్నలకు వాణి వెరైటీగా స్పందిస్తూ ''ఉంది అందులో తప్పేముంది? ఇది మామూలే కదా?'' అనడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారి నాని, వాణీల మధ్య ఎఫైర్ అంటు వార్తలు రావడంతో ఖంగారు పడిన నాని వాణి కపూర్ ను నిలదీస్తే జస్ట్ జోక్ అని నవ్వేసిందట.
ఈ హాట్ బ్యూటీ వాలకం చూస్తుంటే, నాని కాపురం కూల్చేసేలానే కనిపిస్తోంది అంటు ఫిలింనగర్ లో నానీపై సెటైర్లు పడుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి