కంటికి కనిపించని మృత్యువు ... మనిషికి తెలియకుండానే దాడిచేసి... కళ్ళముందే మృత్యువును చూపించి  కాటికి పంపిస్తుంది కరోనా వైరస్. ప్రపంచం  మొత్తం కరోనా  వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి . ప్రపంచ దేశాలన్నీ ప్రాణభయంతో వణికిపోతున్నారు. రోజు రోజుకి విజృంభిస్తున్న   మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకెంతో మంది మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఏకంగా కరోనా  వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటింది. మున్ముందు ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఊహకందని విధంగా ఉంటుంది. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేశాము అని సంతోషం వ్యక్తం చేసిన చైనాలో సంతోషం ఎక్కువ రోజులు నిలువ లేదు మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ తాము కరోనా  వైరస్ ను కట్టడి చేయగలిగాము అని అధికారికంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. 

 

 

 ఈ వైరస్ కి ఎలాంటి మందులు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ఈ వైరస్ మరింతగా విజృంబిస్తుంది. ఇక ఇప్పుడు ఈ వైరస్ కు  సంబంధించి మరో సంచలన నిజం బయట పడింది. కరోనా నిర్దారణ పరీక్షలకి సంబంధించి తాజాగా సంచలన నిజం బయటపడింది. శరీరంలో  కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరీక్షల్లో కరోనా వైరస్  నెగిటివ్ వస్తుంది అంటూ వెల్లడైంది ఓ అధ్యయనంలో. తద్వారా కరోనా  వైరస్ ఉన్న వ్యక్తులకు వైరస్ లేదు అని రిపోర్టులు రావడంతో వారు యథేచ్ఛగా బయట తిరగడం వల్ల ఇంకా  ఎంతో మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటున్నారు పరిశోధకులు. ఒకసారి కరోనా వైరస్ ట్రెండ్  గమనించిన ఇది తెలుస్తుంది వైరస్ పాజిటివ్ గా వెల్లడైన కేసులు 60 నుంచి 70 శాతం మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కరోనా  నెగిటివ్  రిపోర్ట్ వచ్చింది. ఈ క్రమంలో వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉంది. 

 

 

అయితే డాక్టర్ల దగ్గరికి వచ్చినా  పేషెంట్లకు కరోనా  వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు నెగిటివ్ వస్తే  వారికి చికిత్స చేయాలా వద్దా అనే దానిపై కూడా అయోమయంలో  పడ్డారు. కరోనా  వైరస్ లక్షణాల ఆధారంగానే వైద్యం చేయడం తప్ప వేరే మార్గం లేదని అభిప్రాయపడుతున్నారు డాక్టర్లు. అయితే ప్రస్తుత ప్రపంచానికి ఆశా కిరణం లా మారింది సెరోలాజికల్ టెస్ట్ ఒక్కటే . ఓ వ్యక్తి బాడీలో యాంటీ బాడీలను  గుర్తించి . తద్వారా ఆ వ్యక్తి వైరస్ బారిన పడ్డాడా  లేద అని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. శరీరంలో వైరస్ ఉన్నప్పుడే యాంటీబాడీలు తయారవుతాయని..కరోనా  పరీక్షలో  ఇది ఎంతో కీలకంగా మారుతుంది అని భావిస్తున్నట్లు  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు .

మరింత సమాచారం తెలుసుకోండి: