కరోనా సమస్య మొదలైన తరువాత స్వీయ గృహ నిర్భంధంలోకి వెళ్ళిపోయి ఎవ్వరికీ అందుబాటులో లేకుండాపోయిన విజయ్ దేవరకొండ తీరు పై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. ఫిలిం ఇండస్ట్రీలోని చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు చిరంజీవి నేత్రిత్వంలో ఏర్పడ్డ ‘సిసిసి’ కి భారీ ఎత్తున విరాళాలు ఇస్తుంటే విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంలో తన మౌనాన్ని కొనసాగించడంతో ఇండస్ట్రీ కార్మీకుల కష్టాలు విజయ్ కు పట్టవా అంటూ ఇప్పటికే అతడి పై నెగిటివ్ కామెంట్స్ దాడి కొనసాగుతోంది. 


ఇలాంటి పరిస్థితులలో విజయ్ తన స్వీయ గృహ నిర్భధం నుండి బయటకు వచ్చి హైదరాబాద్ సిటీ పోలీస్ ఏర్పాటు చేసిన ఒక  కార్యక్రమానికి వచ్చాడు. సిటీ పోలీస్ కమీషనర్ అంజని కుమార్ సమక్షంలో లాక్ డౌన్ పీరియడ్ లో పోలీసులు ఎలా రియల్ హీరోలుగా మారారో తెలియచేస్తూ విజయ్ తన వీడియో సందేశాన్ని కూడ అందించాడు. 


ఇప్పుడు ఈ సందేశం విన్నవారు విజయ్ ని మరొకవిధంగా టార్గెట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ చెపితే కాని తమకు పోలీసులు రియల్ హీరోలు అని తెలియదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు రాజకీయ నాయకుడులా ఇలాంటి సందేశాలు ఇవ్వడం మానేసి ప్రజలు కరోనా కష్టాలలో ఉన్న పరిస్థితులలో ఏదైనా ఒక మంచిపని చేసి పేదలకు సహాయపడమని విజయ్ కు క్లాస్ పీకుతున్నారు. 


మరికొందరైతే తమిళ హీరో విశాల్ ప్రతిరోజు పేదల కోసం కొన్నివేల ఆహార పొట్లాలు పంచుతున్న విధంగా విజయ్ కూడ ఒక స్ఫూర్తి దాయకమైన పనిచేసి తన అభిమానులకు ఆదర్శంగా నిలవ వచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే పోలీసులు హీరోలు అని చెప్పేందుకు రౌడీనే కావాలా ?  సెలబ్రిటీ సాయం లేనిదే తాము గుర్తించలేమా అంటూ విజయ్ పై విపరీతంగా ట్రోల్స్ తో విరుచుకు పడుతూ విజయ్ కు జ్ఞానోదయం కలిగించాలని కొంతమంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: