రాజ‌మౌళి సినిమా అనౌన్స్ చేయ‌డ‌మే ఆల‌స్యం.. దాని చుట్టూ అనేక ఊహాగానాలు అల్లుకుంటూనే ఉంటాయి. ఇండ‌స్ట్రీలో రోజుకో కొత్త‌ముచ్చ‌ట వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు జ‌క్క‌న్న ఆర్.ఆర్.ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ ఆర్ ఆర్). ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్‌చ‌ర‌ణ‌ నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను పది భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోస్టర్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మాంచి స్పందన వచ్చింది.

 

ఇక ఆ త‌ర్వాత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రత్యేక వీడియో సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక్క‌డి బాగానే ఉందిగానీ.. ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌లో ఎవ‌రికి ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చారు..? ఎవ‌రి పాత్ర‌ను హైలెట్ చేస్తున్నారు..? అన్న ప్ర‌శ్న‌లు అభిమానుల మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. ఈ విష‌యంలో రాజ‌మౌళి కొంత‌మేర‌కు క్లారిటీ ఇచ్చారు. ' ఎన్టీఆర్ - రామ్ చరణ్ క్యారెక్టర్ల రన్ టైమ్ గురించి అభిమానులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, ఇద్దరి పాత్రలకు స‌మాన ప్రాధాన్య‌త ఉంటుంద‌ని చెప్పిన‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న‌ ఈ సినిమా నిడివి సుమారు మూడు గంటలు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేగాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ - ఆలియా భట్ - బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. దీంతో ఈసినిమాకు మ‌రింత క్రేజీ ఏర్ప‌డుతోంది. ఇక‌ ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే. సినిమా విడుద‌ల అయితేగానీ..అస‌లు విష‌యం తెలియ‌దు మ‌రి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: