44ఏళ్ల సూర్య 19ఏళ్ల యువకుడిలా మారిపోవాలి. అంటే 25ఏళ్లు వెనక్కి వెళ్లిపోవాలి. మేకప్ తో మెయిన్ టేన్ చేయడానికి వీల్లేదు. గ్రాఫిక్స్ తో కవర్ చేయడానికి వీల్లేదు. మరి సూర్య 19ఏళ్ల కుర్రాడిలా ఎలా మారిపోయాడో తెలుసా. 

 

క్యారెక్టర్ కోసం.. ఒళ్లు హూనం చేసుకునే అతికొద్ది మంది హీరోల్లో సూర్య ఒకడు. వెయిట్ తగ్గడం కోసం.. సిక్స్ ప్యాక్ కోసం స్పెషల్ వర్కవుట్స్ చేస్తారు. డైట్ ఫాలో అవుతారు. ఇప్పుడు మన హీరోలందరూ చేసేది ఇదే. కానీ.. సూర్యా మాత్రం కొత్త పద్ధతిలో 19ఏళ్ల కుర్రాడిలా మారిపోయాడు. ప్రస్తుతం నటిస్తున్న సూరారైపోట్రు మూవీ కోసం ఎక్స్ పెరిమెంట్ చేశాడు. ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ అవుతోంది. 

 

వెంకటేశ్ తో గురు సినిమా తీసిన సుధ కొంగర దర్శకత్వంలో ఆకాశమే నీ హద్దురా తెరకెక్కుతోంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ సినిమాకు ఆధారం. కరోనా హాలిడేస్ నేపథ్యంలో చిత్ర బృందం 44ఏళ్ల సూర్య యంగ్ హీరోలా ఎలా మారాడన్న పాయింట్ తో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రోజూ ఉదయం రెగ్యులర్ గా చేసే వ్యాయామంతో పాటు షూటింగ్ లో ఖాళీ దొరిగినప్పుడల్లా కరసత్తులు చేస్తూనే కనిపించాడు సూర్య. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వ్యక్తిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. 

 

సూర్య సరసన అపర్ణా బాల మురళి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, జాకీ ష్రాఫ్, పరేశ్ రావల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా ఆగస్ట్ లో విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. మొత్తానికి సూర్య తనలోని టాలెంట్ చూపించేందుకు ఎంతకైనా కష్టపడానడంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: