కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో.. ఎప్పుడు పరిస్థితి నార్మల్ స్టేజ్ కు వస్తుందో తెలియని పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్లాన్ లో సినిమా ఇండస్ట్రీ ఉంది. కరోనాతో భయపడిపోయిన జనాలను మళ్లీ థియేటర్స్ కు రప్పించడం ఎలా.. సినిమాలను ఏ పద్దతిలో రిలీజ్ చేయాలి. టిక్కెట్ల రేట్లు తగ్గించాలా.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ముందు ఉంది. 

 

కరోనా దెబ్బకు షూటింగ్ పూర్తి చేసుకొని.. మార్చి.. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన చాలా చిత్రాలు విడుదల వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ ముగిసినా.. వెంటనే రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. ముందుగా ఏ సినిమా వస్తుందో గానీ.. ఆ చిత్ర యూనిట్ కు ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. కరోనా నుంచి తేరుకున్న జనాలు ఇంతకాలం ఆగిపోయి పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు. ఇక స్టూడెంట్స్ అయితే.. టెన్త్.. డిగ్రీ ఇంజినీరింగ్ తో పాటు.. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలి. సినిమాలపై దృష్టిపెట్టే అవకాశం తక్కువే అని చెప్పాలి. 

 

కరోనా సమస్య సమసిపోయిన తర్వాత ప్రపంచం కోలుకోవడానికి ఏడాది పడుతుందని.. కాదు కాదు రెండేళ్లు పడుతుందని చెబుుతున్నారు. అన్ని ఇండస్ట్రీలు ఒక ఎత్తయితే.. సినిమా ఇండస్ట్రీ మాత్రం మరో ఎత్తు పక్కనపక్కనే కూర్చొని చూడాలి, కోవిడ్ తగ్గినా.. పక్కపక్కనే కూర్చొని చూసే ధైర్యం జనాలకు ఉండకపోవచ్చు. దీనికి సినిమావాళ్లు ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు. సీటుసీటుకు మధ్య ఒకటి రెండు సీట్లు ఖాళీ ఉంచి.. థియేటర్ కెపాసిటీలో 50శాతం.. అంతకంటే తక్కువ టిక్కెట్లే అమ్మాలన్న ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారట. కరోనా భయం పూర్తిగా పోయిన తర్వాతే వందశాతం టిక్కెట్లు అమ్ముతారట. 

 

కరోనా తగ్గుముఖం పట్టినా.. భయం కారణంగా జనాలు థియేటర్స్ కు వచ్చే అవకాశం కనిపించడం లేదు. రిలీజ్ కు ఇబ్బడిముబ్బడిగా సినిమాలున్నాయి. దీంతో ఆడియన్స్ ను ఆకర్షించే క్రమంలో.. టిక్కెట్ రేటు తగ్గించాలన్న ప్లాన్ కూడా ఒకటుంది. కరోనా అందరినీ ఆర్థికంగా నష్టపరిచింది. ఈ సమయంలో 150.. 200 రూపాయలు పెట్టి టిక్కెట్ కొనేందుకు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టిక్కెట్ రేటు తగ్గించి థియేటర్స్ లోకి రావడానికి జనాలు అలవాటుపడిన తర్వాత టిక్కెట్ రేట్లు యథాస్థితికి తీసుకొచ్చే ఆలోచన కూడా సినీ వర్గాల్లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: