యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాం చరణ్ మరోగా నటిస్తున్న ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఒకవైపు రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తూనే మరోవైపు త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. 'అయినను పోయిరావలె హస్తినకు' అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 సినిమా కావడం విశేషం. 

 

ఈ పాటికే మొదలవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఇప్పట్లో మొదలవదని తాజాగా అందిన సమాచారం. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ పార్ట్ గనక కంప్లీట్ అయితే అక్టోబర్ నుండి త్రివిక్రమ్ తో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించడానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారట. అక్టోబర్ నుంచి నాన్ స్టాప్ గా ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కంప్లీట్ చేసి సమ్మర్ కి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే నటించనుందని అంటున్నారు. 

 

ఇక ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమా అంటూ కొత్త బాట పట్టారు. ప్రత్యేకంగా హీరోలు, దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటి సాధించాలనే పాకులాడుతున్నారు. స్క్రిప్ట్స్ ని కూడా భారీ కాన్వాయిస్ తో ఆ స్థాయిలోనే రాసుకుంటున్నారు. ఇందుకు భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. కాని ప్రస్తుతం కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల్లో సౌత్ అండ్ నార్త్ లో ఉన్న చిత్ర పరిశ్రమలేవి ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. అయినా కూడా ప్రతీ సినిమాని పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని అంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటే కూడా పాన్ ఇండియా సినిమా అంటూ పాకులాడటం ఏంటని కొందరు అభిప్రాయపడుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: