టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. టాలీవుడ్ లో ఆమె సినిమాలు అనగానే అభిమానులకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆమె చేసే సినిమాల మీద ఒక క్రేజ్ అనేది అదే ఏర్పడింది. టాలీవుడ్ లో చిన్న చిన్న దర్శకులు కూడా ఆమె తో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనేది తెలిసిందే. ఇప్పుడు ఆమె కోసం ఒక బాలీవుడ్ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఒక భారీ సినిమాను ఆమె తో ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఆమె బాలీవుడ్ లో వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. అయినా సరే భారీ పారితోషికం ఇచ్చి ఆమెను తీసుకోవాలి అని భావిస్తున్నారట. ఆమె అక్కడ భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు కూడా ఆమెకు భారీగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని ఆమె మాత్రం ఆలోచన చేస్తుంది అంటున్నారు. సినిమా విజయం కోసం అక్కడ తాము కృషి చేస్తామని కొందరు ఆమె సన్నిహితులు కూడా చెప్పారట ఆ సినిమా చేస్తే అక్కడ మంచి సినిమాల్లో ఆఫర్లు వస్తాయని కూడా ఆమెకు చెప్పినా... 

 

ఆమె మాత్రం అక్కడ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం అనుష్కసినిమా చేయడం లేదు ఆమె నటించిన సినిమా ఒకటి విడుదల కావాల్సి ఉంది. ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆమె ఆ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది. టాలీవుడ్ లో ఆమెకు ఉన్న క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని అక్కడ సినిమా చేస్తే మంచి లాభం ఉంటుంది అనే భావన లో ఉన్నారట. మరి ఆమె అంగీకరిస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: