టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ లకు ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. హీరోయిన్ ల కొరత ఎక్కువగా ఉంది మన తెలుగులో. చిన్న చిన్న హీరోయిన్ లు కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. దీని కారణంగా నిర్మాతలు దర్శకులు బాగా ఇబ్బంది పడుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో మన తెలుగు హీరోలు కూడా ఇప్పుడు హీరోయిన్ లను కమర్షియల్ గా ఉండాలని సూచనలు చేస్తున్నారు. దీనితో దర్శక నిర్మాతలకు ఈ పరిణామం బాగా ఇబ్బంది గా మారింది అనేది టాలీవుడ్ జనాల మాట. ప్రస్తుతం మన తెలుగు సినిమాల్లో నటించడానికి బయటి హీరోయిన్ లు బాగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. 

 

ఇక తమిళ హీరోయిన్ లు మన తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు. తెలుగు లో సినిమాలు చేయడానికి అవకాశాలు వచ్చినా సరే వాళ్ళు మాత్రం ముందుకు రావడం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి కారణం ఏంటో తెలియదు గాని వాళ్ళు బాగా భయపడుతున్నారు. అవకాశం వచ్చినా సరే వాళ్ళు మాత్ర౦ ముందుకు రావడం లేదని సమాచారం. దానికి సంబంధించి కారణం ఏంటో గాని కొందరు హీరోయిన్ లను ఇక్కడి దర్శకులు అడిగినా సరే... మాకు కమర్షియల్ గా చేయడం రాదు అని అంటున్నారట. 

 

తమకు తమిళంలో మంచి ఆఫర్లు ఉన్నాయని కాని తాము మాత్రం తెలుగు లో సినిమాలు చేయలేము అని చెప్పినట్టు సమాచారం. తెలుగులో హిట్ అయితే బాగానే ఉంటుంది లేకపోతే మాత్రం ఐరన్ లెగ్ అనే ముద్ర పడుతుంది అని తాము దాని ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారట. ప్రస్తుతం తాము తమిళంలో సినిమాలు చేసుకుంటే చాలు అని స్పష్టం గా చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: