మెగాస్టార్ చిరంజీవి ప్రతి విషయంలో స్పెషల్ గా ఉంటారు అనే విషయం తెలిసిందే. అది సినిమాల విషయంలో అయినా వ్యక్తిగతంగా ఆయన లేదా సేవా కార్యక్రమాలలో ఆయన అందరికంటే  భిన్నంగా ఆలోచిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ పెద్దగా.. యువ హీరోలు అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్న విషయం తెలిసిందే. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఇప్పటి వరకు చిరంజీవి సోషల్ మీడియా ఖాతాను కలిగి లేరు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తన సోషల్ మీడియా ఖాతాని తెరచిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో తన ఖాతాను తెరిచారు లేదో అప్పటి నుంచి ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. 

 


 కేవలం చిత్ర పరిశ్రమకు సంబంధించి మాత్రమే కాకుండా సామాజిక సమస్యల పట్ల ప్రజలను చైతన్య పరుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమా ముచ్చట్లు కూడా అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకర్షిస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. కేవలం సినిమాలు సామాజిక సమస్యల గురించి కాదు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ మెగా అభిమానులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఆనందాన్ని పంచుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  మెగాస్టార్ చిరంజీవి ఆదివారం 1980లలో  రీ యూనియన్  వేడుకల్లో కథానాయకులతో కలిసి డాన్స్ చేసిన ఓ పాత వీడియోను పోస్ట్ చేశారు. 

 


 1980 తారల 10 వ  రీ యూనియన్ వేడుకలు గత ఏడాది చిరంజీవి నివాసంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ యూనియన్ వేడుకల్లో అప్పటి 1980 కాలం నాటిది దక్షిణాది కథానాయికల్లో అందరూ పాల్గొన్నారు. ఇక ఇందులో భాగంగానే 1980 లో స్టార్ హీరోయిన్ లుగా కొనసాగిన సుహాసిని krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ జయసుధ జయప్రద లతో తన సినిమాలలోనే సూపర్ హిట్ సాంగ్ లలో  డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎంతో సరదాగా కనిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పటి పాత వీడియోలు తాజాగా ఆదివారం ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ఇక చిరంజీవి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను తెగ ఆకట్టుకోవడమే కాదు.... సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: