ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారత చిత్ర పరిశ్రమలో  ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి ఇలాంటి వరల్డ్ వైడ్ సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మొదటి సినిమా కావడంతో... ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచుకున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు... ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 

 

 ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ బయటికి వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్  నటిస్తుండగా... కొమరం భీమ్ పాత్రలో  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే అల్లూరి సీతారామరాజు అదే  రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయిన విషయం తెలిసిందే. మామూలుగానే చరణ్ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తారు అన్న విషయం తెలిసిందే. కానీ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రెట్టింపు చేసినట్లు కనిపించింది. ఎక్కడికక్కడ కండలు తిరిగిన దేహంతో... అల్లూరి సీతారామరాజు పౌరుషాన్ని ఎలుగెత్తి చూపే విధంగా రామ్ చరణ్ తన ఫస్ట్ లుక్ లో అదరగొట్టాడు. 

 

 

 అయితే ప్రేక్షకులు రాజమౌళి సినిమా పై ఎన్ని అంచనాలు పెంచుకున్నప్పటికీ... రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న  సినిమా విషయంలో కూడా ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా సన్నివేశాలు ఉండబోతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా ఇది ఒక కాల్పనిక కథ అనే విషయం తెలిసిందే. దీంతో ఎన్నో అబ్బురపరిచే సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకందని యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయి ఆర్ఆర్ఆర్ సినిమా లో అన్నది అందరూ అనుకుంటున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: