టాలీవుడ్ లో రీమేక్ ల హవా బాగా నడుస్తోంది అన్న విషయం తెలిసిందే. వేరే భాషలో వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాలన్నీ స్టార్ హీరోలతో రీమేక్ చేసి మంచి విజయాలను అందుకుంటూ వుంటారు. ఇలా ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రీమేక్ సినిమాలు వచ్చి మంచి విజయాలు అందుకున్నారు.. కొన్ని కొన్ని సినిమాలైతే ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచాయి. ఇక అటు హీరోలు కూడా రీమేక్ సినిమాలపై ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో రీమేక్  సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇలా రీమేక్ సినిమా గా వచ్చిన సినిమా ధ్రువ. 

 

 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ధ్రువ. ఈ సినిమాలో రామ్ చరణ్ ను  ఢీకొట్టే విలన్ పాత్రలో  అరవిందస్వామి నటించారు. ఇక రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ధ్రువ సినిమా ఎంత  మంచి విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్ళని  కూడా రాబట్టింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక విలన్ పాత్రలు అరవిందస్వామి డైలాగులు యాక్టింగ్ అయితే విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. 

 

 

 అయితే ఈ ధ్రువ సినిమా కోలీవుడ్ సినిమా ఆయన  తని ఒరువన్ అనే సినిమా నుంచి రీమేక్ చేశారు. ఈ సినిమా కోలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక తెలుగు విషయానికి వస్తే ధ్రువ సినిమా లో రాంచరణ్ ఫిట్నెస్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. అదే సమయంలో రామ్ చరణ్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా అదరగొట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అడుగడుగున అదిరిపోయే ట్విస్ట్ లతో సినీమా అందరినీ మెప్పించింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: