ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటి వరకు ఎన్నో సార్లు మీడియా ముఖంగా చెబుతున్నాను.. మళ్లీ చెబుతున్నాను.. నాకు సుడిగాలి సుధీర్ కి మంచి స్నేహం అంతే.. అంతే.. అంటుంది జబర్ధస్గ్ హాట్ బ్యూటీ యాంకర్ రష్మి గౌతమ్. ఏడేళ్ల క్రితం మొదలైన జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్ గా అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఆరునెల్లకే ఈ అమ్మడికి తెగ పాపులారిటీ రావడంతో కొంత కాలం ఈ కార్యక్రమానికి గుడ్ బాయ్ చెప్పింది. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చింది రష్మి గౌతమ్. అప్పటికే ఈ బ్యూటీ కొన్ని చిత్రాల్లో నటించింది. జబర్ధస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్స్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ నేపథ్యంలో రష్మి - సుధీర్ కి మంచి జోడీ కుదిరింది. అప్పటి నుంచి ఈ జంట ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఒకనొక రియాల్టీ షోలో డమ్మీ పెళ్లి కూడా చేసుకున్నారు.
అప్పటి నుంచి వీరి మద్య అదేదో నడుస్తుందని.. తర్వలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘సుడిగాలి’ సుధీర్ కు రష్మికి మధ్య ఏదో ఉందంటూ వదంతులు వ్యాపించడం, వాటిని ఖండించడం రష్మి చేస్తూనే ఉంది. తాజాగా, ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె మరోమారు స్పందించింది. ఈ విషయం గురించి నేను పదే పదే చెబుతున్నా.. నాకు ఇబ్బంది అనిపించినా చెబుతున్నాను.. సుధీర్, తానూ నటీనటులం మాత్రమేనని, స్క్రిప్ట్ కి అనుగుణంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు తామిద్దరం కష్టపడి ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తుంటామని చెప్పింది.
మా కెమిస్ట్రీ కుదిరింది కనుక మాకు తగ్గ స్క్రిప్ట్ ఇస్తుంటారు.. అలా మేం నటిస్తున్నాం తప్ప మా మద్య ఏమీ లేదు. నిజజీవితంలో తామిద్దరం గొప్ప స్నేహితులం కూడా కాదని చెప్పిన రష్మిక, తమ మధ్య ఓ మంచి బంధం ఉంది తప్ప అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేసింది.