కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ అన్ని రంగాలపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా వైరస్ ముఖ్యంగా వినోదరంగంపై అశనిపాతంలా పడింది. గత రెండు నెలలు లాక్‌ డౌన్ కారణంగా సినిమా హాల్లు, షూటింగ్స్ అన్ని మూత పడ్డాయి. నిర్మాతలకు కొన్ని కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్స్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధం చేసిన తమ తమ సినిమాల రిలీజ్ విషయమై తలపట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అయితే లాక్‌ డౌన్‌ లో భాగంగా కొన్నిరంగాలు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందినవారిలో ఆశలు రేకెత్తాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, థియేటర్స్ ఓపెన్ అవుతాయని, షూటింగ్స్ మళ్లీ మొదలు పెట్టుకోవచ్చని అంతా అనుకున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్ గతంలో జరిగిన సమీక్షలో జూన్ లో షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే.  కానీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్స్ అందర్నీ షాక్‌ కు గురి చేసింది.

 

'ప్రస్తుతం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుంది. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని నేను అనుకోవటం లేదు. భౌతిక దూరం ఉండేలా థియేటర్ల సీటింగ్ మార్చాల్సి ఉంది. ఈ నిబంధనకు మల్టిప్లెక్స్‌ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నా.. సింగిల్‌ స్క్రీన్స్‌ తో పాటు పట్టణాలు గ్రామాల్లోని థియేటర్లు ఆర్ధిక భారాన్ని మోయలేవు. ఎగ్జిబిటర్‌ లు కూడా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే కనీసం మరో 3 లేదా 4 నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం మాకు లేదు' అని మంత్రి తలసాని వెల్లడించారు. సాధారణ పరిస్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని.. షూటింగ్‌ ల విషయంలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మరి ఈ పరిణామాలపై నిర్మాతలు.. సినీ పెద్దలు.. థియేటర్ల యాజమాన్యాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: