మోహన్ బాబు.. మన అందరికి ఈ పేరు కలెక్షన్ కింగ్ గా తెలుసు. టాలీవుడ్ లో ఈయన తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు. మోహన్ బాబు ఒక మంచి నటుడిగానే కాదు, రాజకీయ నాయకుడి గాను, వ్యాపారవేత్త గాను మన అందరికి తెలుసు. ఈయన నటుడు మాత్రమే కాదు పలు చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన ఐదు వందలకు పైగా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం మోహన్ బాబు విద్యా నికేతన్ పేరుతో విద్యా సంస్థల నిర్వహణలో బిజీగా గడుపుతున్నారు.

 

మోహన్ బాబు కెరీర్ పరంగా దాసరి నారాయణరావు గారు తొలి అవకాశo కల్పించారు. ప్రారంభంలో విలన్ గా, సహాయ నటుడిగా పని చేశాడు. తర్వాత 1990 లో వచ్చిన అసెంబ్లీ రౌడీ సినిమా అప్పుడే స్టార్ గా నిలదొక్కుకుంటున్న మోహన్ బాబుకి సూపర్ స్టార్ గా నిలబెట్టింది. ఇక ఆ తరవాత వచ్చిన అన్ని సినిమాలతో ఆయన తన స్టార్ డం ని పదిలం చేసుకున్నారు. ఇక అప్పటి నుండి వరుస విజయాలతో కలెక్షన్ కింగ్ అనిపించుకున్నాడు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్ బాబు సరసన దివ్య భారతి నటించింది.

 

ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతను  మోహన్ బాబు గారు వహించారు. గొల్లపూడి, జగ్గయ్య, అన్నపూర్ణ, బ్రహ్మానందం తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాకు కే. వి  మహదేవన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైన్ గా తెరకెక్కింది. ఈ సినిమా తో మోహన్ బాబు అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం మోహన్ బాబు వ్యాపార వేత్త గా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: