తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖులు ఒక సాదాసీదా వ్యక్తులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించి మహోన్నత వ్యక్తులు గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రభావితం చేసి ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు మారుపేరుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభావితం చేసిన వారిలో నేటి తరానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి దర్శక ధీరుడు రాజమౌళి. బుల్లితెర నుంచి వెండితెర దర్శకుడిగా మారిన రాజమౌళి ప్రస్తుతం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి వెండితెర ను ఎంతగానో ప్రభావితం చేశారు. వెండితెరపై సత్తా చాటి ఎంతగానో గుర్తింపు సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమకు నిలువుటద్దంగా మారిపోయారు  రాజమౌళి. 

 


 రాజమౌళి సినీ ప్రస్థానం మొత్తం ఒక సంచలనమే అని చెప్పాలి... మొదటి సినిమా నుంచి రాజమౌళి సినీ ప్రస్థానం ఎంతో విజయవంతంగా దూసుకుపోయింది. రాజమౌళి  సినీ ప్రస్థానంలో ఎక్కడ ఒడిదుడుకులు ఎదురవ్వలేదు... పట్టుకున్నదల్ల బంగారం అయినట్లుగా రాజమౌళి చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏ  దర్శకుడికి లేనంత ఖ్యాతిని ఆయనకు  సినిమాలు తీసుకువచ్చి పెట్టాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి అంటే ఒక ఆదర్శం గా మారిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఆయన హవా నడిపిస్తున్నారు రాజమౌళి. 

 

 ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలను కూడా చేశారు రాజమౌళి. ప్రతి సినిమాకీ తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన రాజమౌళి... తెలుగు చిత్ర పరిశ్రమలో  ఒక అధ్యాయాన్ని లిఖించారు అనడంలో అతిశయోక్తి లేదు. రాజమౌళి అనే పుస్తకంలో ఎన్నో విజయాలు... ఎన్నో అద్భుత సినిమాలు. సాదాసీదా సినిమా ల నుంచి గ్రాఫిక్స్ సినిమాల వరకు అన్ని రాజమౌళి కెరీర్లో ఉన్నాయి. కేవలం హీరోలను పెట్టి సినిమాలు తీసే దర్శకులను చూస్తూ ఉంటాం కానీ అదే ఒక ఈగ ను పెట్టి మొత్తంగా సినిమాను తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజమౌళి ఒక్కడే అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్న రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: