ప్రస్తుతం ప్రపంచ దేశాలని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా. దీని వల్ల దేశంలో ఊహించని పరిణామాలు, కోలుకోలేని దెబ్బలు ప్రతీ ఇండస్ట్రీకి తగిలాయి. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ప్రతీ ఒక్కరికి ఇది పెద్ద ఉదాహరణగా నిలిచింది. రెండు నెలల సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత ఎట్టకేలకి సినీ పెద్దలు ముఖ్యమంత్రి మధ్య జరిగిన చర్చల తర్వాత షూటింగ్స్ కి అనుమతులు లభించాయి. దాంతో ఇప్పుడిప్పుడే ఇప్పటికే సగ భాగానికి పైగా షూటింగ్ జరిగిన సినిమాలకి షెడ్యూల్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఈ సినిమాలకే అని సమాచారం.

 

IHG

 

ఇప్పుడు కొత్తగా ప్రారంభించాల్సిన సినిమాలకి అంటే.. సర్కారు వారి పాట, ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కే కొత్త సినిమా లాంటి వాటికి కాదని తెలుస్తుంది. షూటింగ్ కంప్లీటయి పోస్ట్ ప్రొడక్షన్ జరగాల్సిన సినిమాలతో పాటు 40 శాతం టాకీ పార్ట్ పూర్తయిన సినిమాలకు ముందుగా అనుమతులు రావడంతో ఆర్.ఆర్.ఆర్, మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివల ఆచార్య, వెంకటేష్ నారప్ప, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమా, ప్రభాస్ రాధాకృష్ణ సినిమా, నితిన్ రంగ్ దే లాంటి సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు సర్వం సిద్దమవుతున్నారు. 

 

IHG'సర్కారు వారి పాట ...

 

అయితే కొంతమందిలో ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవడమూ కష్టమన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం కనీసం ఒక సినిమాకి ఎంత తక్కువ మంది అనుకున్నా 24 డిపార్ట్మెంట్స్ కి 50 మంది యూనిట్ సిబ్బంది లేకపోతే గాని చిత్రీకరణ జరపడం సాధ్యం అవదు. ఈ కారణంగానే ఇలా భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రతీ ఒక్కరు కరోనా తో తమ సినిమాలకి భారీగా నష్టం వాటిల్లిందని థియోటర్స్ ఓపెన్ కాకపోవడం పెద్ద కారణమని కరోనాతోనే ఇన్ని సినిమాలు మూలన పడ్డాయని ..ఇలా మాట్లాడితే కరోనా నే అంటున్నారు. అయితే వాస్తవంగా చూస్తే మాములు రోజుల్లో ఒక సినిమా రిలీజయ్యాక హిట్ టాక్,.. పర్వాలేదు అంటేనే జనాలు థియోటర్స్ కి వచ్చేవారు. 

 

IHG

సినిమా మార్నింగ్ షో తర్వాత టాక్ ని బట్టే ఆ సినిమాకి వచ్చే లాభ నష్టాలుండేవి. ఈ విషయం నిశితంగా పరిశీలిస్తే సంవత్సరంలో గనక 100 సినిమాలు రిలీజైతే స్టార్స్ తో సంబంధం లేకుండా ఆ 100 సినిమాలలో తిప్పి కొడితే 10 సినిమాలే హిట్ గా నిలిచి నిర్మాతలకి లాభాలు తెచ్చి పెట్టేవి. అంటే దీన్ని బట్టి సక్సస్ రేట్ ఏంటో లెక్క వేసుకోవచ్చు. అనుకోవడానికి ఇప్పుడు కరోనా ఉంది. మరి అంతకముందు పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి.. ఎవరిని నిందించాలి... వరసగా సినిమాలు రిలీజైనా.. ఫ్లాప్స్ గా భారీ డిజాస్టర్స్ గా మిగలడమే కాదు ప్రేక్షకులను బాగా నిరాశ పరచాయి. ఇక్కడ కూడా కోట్లలోనే నష్టం వచ్చింది కదా .. గత కొన్ని రోజులుగా కొంతమంది సీనియర్ విశ్లేషకుల్లో ఇదే చర్చ జరుగుతోందట. మరి ఈ విశ్లేషణ ఇప్పుడున్న మేకర్స్ చేసుకుంటే ఇక ముందైనా నష్టాలు వాటిల్లే అవకాశం తగ్గుతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: