మాహిస్మతి.. అంటే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల లో నటించిన ఈమె స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు,తమిళంలో అయినా సరే రమ్యకృష్ణ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  పని లేదు. చిన్న వయసులోనే సినిమాలలోకి వచ్చిన ఈమె ఎన్నో అవార్డులను అందుకుంది. ఇక స్టార్ హీరోలు అందరి తో వరుసగా సినిమాలు చేసి మంచి హిట్స్ కొట్టి అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రమ్యకృష్ణ.

 

 

సినిమా కెరియర్లో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన ఈ అందాల బొమ్మ.. వ్యక్తిగత జీవితం లో దర్శకుడు కృష్ణ వంశీ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. కృష్ణ వంశీ ని ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమె హీరోయిన్ గా కాకుండా  సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అగ్ర హీరోయిన్ అయినా సరే ఎలాంటి పాత్ర అయినా సరే కథ డిమాండ్ చేస్తే మాత్రం ఆమె కచ్చితంగా చేస్తారు అనే పేరు మాత్రం టాలీవుడ్ లో ఉంది. పెళ్లి అయిన తర్వాత భర్త ప్రోత్సాహం తో ఆమె మరింత అందంగా నటించే ప్రయత్నం చేసారు. 

 

 

 

బాహుబలి సినిమాలో ఆమె చేసిన పాత్ర ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా చెప్పవచ్చును. ఆ విధంగా ఆమె ఆ పాత్ర తో వేలాది మంది కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అనే  చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో అక్కడి నుంచి ఆమెకు వరుసగా పాత్రలు వచ్చాయి. ఆమె సినిమాల కోసం ఇప్పటికి కూడా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అంతే కాదండోయి ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: