చిన్న సినిమాల భవిష్యత్తుపై ఇప్పుడు అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. అసలు వాటి పరిస్థితి ఏంటీ అనే దాని మీద ఇప్పుడు చాలా చర్చలే నడుస్తున్నాయి. చిన్న సినిమాల విషయంలో ఓటీటీ మీదనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది అని టాలీవుడ్ లో అంటున్నారు. ఇతర భాషల్లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. హింది లో స్టార్ హీరోల సినిమాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేయడమే  మంచిది అనే అభిప్రాయానికి వచ్చేశారు అంటే  పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు.

 

అగ్ర హీరోల సినిమాల విషయంలో ఏమో గాని చిన్న హీరోల సినిమాలు మాత్రం నానా కష్టాలు పడుతున్నాయి. ఓటీటీ లో విడుదల చేయడం మినహా మరో మార్గం లేదు అని అంటున్నారు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు అని మరికొందరు అంటున్నారు. చిన్న హీరోలు అయితే తమకు భవిష్యత్తు ఉండాలి అంటే ఓటీటీ ఒక్కటే మార్గం అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కొందరు చిన్న హీరోలు ఓటీటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాజాగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

మారుతున్న టెక్నాలజీకి, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మనం మారాలనీ, అందుకే భీమవరం టాకీస్‌ పేరు మీద ఓటీటీని త్వరలో ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఇది కూడా మల్టీప్లెక్స్‌ థియేటర్‌ లాంటిదే అని ఆయన పేర్కొన్నారు. కాకపోతే ఇందులో మేం సినిమాలు కొనమని ఆయన వివరించారు. ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే అమ్ముకొనే హక్కు నిర్మాతకే ఉంటుందని చెప్పారు. మా థియేటర్‌లో నిర్మాతకు నచ్చిన సినిమాను పెట్టుకోవచ్చని ఆయన వివరించారు. సినిమా క్వాలీటీ, కంటెంట్‌ ని బట్టి ప్రేక్షకుడు సినిమా చూస్తాడనీ, మూడు  రోజుల్లో ఆ సినిమాను అందరూ చూసేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: