టాలీవుడ్ యువ నటుడు నితిన్, తేజ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన జయం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసాడు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన నితిన్, ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుని ముందుకు సాగాడు. ఆపై కెరీర్ లో మంచి సక్సెస్ లతో పాటు, మధ్యలో కొన్ని ఫ్లాప్ లు కూడా చవిచూసిన నితిన్ కు ఇటీవల నాగర్ కర్నూల్ కు చెందిన డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె షాలినితో మొన్న ఫిబ్రవరిలో పెద్దలు వివాహం నిశ్చయించారు. అనంతరం అదే నెల 15న వారిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. 

IHG's Wife) Wiki, Age, Height, Figure ...

కాగా అదే సమయంలో ఏప్రిల్ 16ని వివాహ తేదీగా నిశ్చయించారు. అయితే ఆ తరువాత కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో వివాహ తేదీని వాయిదా వేశారు. ఇక ఇటీవల లాక్ డౌన్ పరిస్థితులను కేంద్రం కొంత సరళతరం చేయడంతో, ఈ నెల 26వ తేది రాత్రి 8 గం. 30ని. లకు హైదరాబాద్ లో పరిమిత అతిథుల మధ్య వివాహాన్ని జరిపించాలని నిశ్చయించారు. కాగా తన వివాహ వేడుకకు విచ్చేయాలని, కాసేపటి క్రితం తన తండ్రి సుధాకర్ రెడ్డి తో కలిసి ప్రగతి భవన్ కు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాహ పత్రికను అందచేశారు నితిన్. 

 

ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రభుత్వ నియమాలకు లోబడి తక్కువమందితోనే వివాహం జరుపుతున్నాం అని, అలానే ఈ వివాహానికి మీరు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించాలని నితిన్ తండ్రి, కేసీఆర్ ని ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తోంది. అయితే వారి ఆహ్వానాన్ని స్వీకరించిన కేసీఆర్, తప్పనిసరిగా వస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ వివాహానికి టాలీవుడ్ కి చెందిన ముఖ్యమైన సినీ ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: